
హైదరాబాద్ లో క్రికెట్ బెట్టింగ్ రాకెట్ ను పోలీసులు చేధించారు. కమీషనర్ టాస్క్ ఫోర్స్, సౌత్ జోన్ టీమ్, హైదరాబాద్, ఛత్రినాక పోలీసులు సంయుక్తంగా సోదాలు జరిపారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లలో క్రికెట్ బెట్టింగ్‌లను అక్రమంగా నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి లక్షా 81 వేల నగదు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒకరు పరారీలో ఉన్నారు. కేసుకు సంబంధించిన విషయాలను పోలీసులు వెల్లడించారు.
లాక్ డౌన్ సమయంలో...
ప్రధాన నిందితుడైన విజయ్ రాజ్ (బుకీ) హైదరాబాద్ ఉప్పుగూడలో నివాసముంటున్నాడని, ఇతను ఓ వైన్ షాపులో భాగస్వామిగా ఉన్నాడన్నారు. లాక్ డౌన్ సమయంలో క్రికెట్ బెట్టింగ్‌కు బానిసయినట్లు, ఇతనికి మహారాష్ట్ర అలీ పరిచయం అయ్యిందన్నారు. అతడితో కలిసి విజయ్ క్రికెట్‌లో పంటింగ్ మొత్తం కోసం Goldenexch.pro అప్లికేషన్ యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌ను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అనంతరం ఇతర పంటర్లు భరత్, K. హేమంత్, రాజులకు యూజర్ ID, పాస్‌వర్డ్‌లను వెల్లడించారన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆసియా కప్‌తో పాటు T20 క్రికెట్ మ్యాచ్‌ల్లో బెట్టింగ్ లు కొనసాగించారని తెలిపారు. నిందితులను పట్టుకుని బెట్టింగ్ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఎస్‌హెచ్‌ఓ ఛత్రినాక పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
నిందితుల పేర్లు..
1) విజయ్ రాజ్, వయస్సు. 39 సంవత్సరాలు, Occ: వ్యాపారం, R/o ఉప్పుగూడ, ఛత్రినాక, హైదరాబాద్ (సబ్-బుకీ)
2) ఎ. భరత్, వయస్సు. 28 సంవత్సరాలు, Occ: వ్యాపారం R/o వెంకటేశ్వర కాలనీ, బాలాపూర్, హైదరాబాద్ (పంటర్)
3) కె. హేమంత్, వయస్సు. 30 సంవత్సరాలు, Occ: గోల్డ్ వర్క్, R/o ఉప్పుగూడ, ఛత్రినాక, హైదరాబాద్ (పంటర్)
4) ఎ. రాజు, వయస్సు.40 సంవత్సరాలు, Occ: హోటల్ వ్యాపారం, R/o సరూర్‌నగర్, హైదరాబాద్ (పంటర్)
5) అలీ, R/o మహారాష్ట్ర (ప్రధాన బుకీ-పరారీ)
స్వాధీనం చేసుకున్నవి
1) నికర నగదు రూ. 1,81,000/-
2) 4-సెల్ ఫోన్లు