
ఆసియా కప్ లో సూపర్ ఇన్నింగ్స్ తో ఇండియాను గెలిపించిన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ మంగళవారం (సెప్టెంబర్ 30) సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మను సత్కరించి అభినందించారు సీఎం రేవంత్.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు క్రికెట్ బ్యాట్ ను బహూకరించారు తిలక్ వర్మ. ఫైనల్ మ్యాచ్ విశేషాలతో పాటు తిలక్ గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం. తిలక్ ను ప్రోత్సహిస్తూ వచ్చిన కోచ్ ను మెచ్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ ఛైర్మన్ శివసేనా రెడ్డి, శాట్స్ ఎండీ సోనిబాల దేవి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆదివారం (సెప్టెంబర్ 28) జరిగిన ఆసియా కప్ ఫైనల్ లో.. ఇండియా కష్టాల్లో ఉందనుకున్న సమయానికి తిలక్ వర్మ ఆదుకుని అద్భుత విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియాకు.. టాప్ ఆర్డర్ వెంట వెటనే పెవిలియన్ బాట పట్టడంతో మ్యాచ్ భారాన్ని తన భుజాలపై వేసుకుని 53 బంతుల్లో 69 రన్స్ చేసి స్టన్నింగ్ విక్టరీ ఇచ్చాడు. సంజూ శాంసన్ (24), శివం దూబే (33) తో బెస్ట్ పార్టనర్ షిప్ మెయింటైన్ చేస్తూ.. మ్యాచ్ ను గెలిపించి నాటౌట్ గా నిలిచాడు తిలక్.