Cristiano Ronaldo: ఓ మై గాడ్ అనాల్సిందే: రొనాల్డోకు ఎంగేజ్ మెంట్.. డైమండ్ రింగ్ ఖరీదు రూ.42 కోట్లా..

Cristiano Ronaldo: ఓ మై గాడ్ అనాల్సిందే: రొనాల్డోకు ఎంగేజ్ మెంట్..  డైమండ్ రింగ్ ఖరీదు రూ.42 కోట్లా..

పోర్చుగీస్ స్టార్ పోర్చుగీస్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. సోమవారం (ఆగస్టు 12) తన లైఫ్ టైం గర్ల్ ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్జ్‌ని ఎనిమిది సంవత్సరాల డేటింగ్ తర్వాత నిశ్చితార్థం చేసుకోవడం విశేషం. ఈ విషయాన్ని జార్జినా రోడ్రిగ్జ్‌.. రోనాల్డో చేతి మీద తన చేయిని ఉంచిన ఫోటోను షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. రొనాల్డో ఆమె చేతికి తొడిగిన  నిశ్చితార్థ ఉంగరానికి డైమండ్స్ ఉండడంతో.. ఈ రింగ్ ఖరీదుపై నెటిజన్స్ ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ రింగ్ ధర తెలియడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ నోరెళ్లబెడుతున్నారు. 

రొనాల్డోతో ఎనిమిదేళ్ల రిలేషన్షిప్ లో ఉన్న జార్జినా.. తన 35 క్యారెట్ల డైమండ్ రింగ్ ను చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. రింగ్ 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వజ్రం క్వాలిటీ, పరిమాణం చూస్తే చాలా ఖరీదైనదని తెలుస్తోంది. ఓవల్ ఆకారంలో ఉన్న ఈ డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్ విలువ 2 నుంచి 5 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. అంటే సుమారు రూ.16.8 కోట్ల నుండి రూ. 42 కోట్లు వరకు ఈ రింగ్ కాస్ట్ ఉన్నట్టు నిపుణులు సూచిస్తున్నారు. బ్రియోనీ రేమండ్ ప్రకారం.. ఓవల్ వజ్రం 25-30 క్యారెట్ల మధ్య ఉండవచ్చు. కొంతమంది ఇది కనీసం 15 క్యారెట్లు ఉండవచ్చని చెబుతున్నారు.

రేర్ క్యారెట్ CEO అజయ్ ఆనంద్ ఈ ఉంగరం విలువను USD 5 (రూ. 42 కోట్లు) మిలియన్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. 2016 నుంచి ఈ జంట రిలేషన్షిప్ లో ఉన్నారు. గత ఎనిమిదేళ్లుగా వీళ్లు కలిసే ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు రొనాల్డో ఆమెకు ఖరీదైన ప్రపోజల్ తో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఆ దంపతులకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అలానా మార్టినా (2017), బెల్లా ఎస్మెరాల్డా (2022) ఏంజెల్ (2022). కానీ ఆమె పుట్టిన కొద్దిసేపటికే మరణించింది.