శంషాబాద్లో మొసలి కలకలం

శంషాబాద్లో మొసలి కలకలం

శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చారిత్రక వెండికొండ సిద్ధేశ్వరస్వామి ఆలయం వద్ద మొసలి కలకలం రేపింది. ఆలయ ముఖ ద్వారం వద్ద వాగులో మంగళవారం మొసలి ప్రత్యక్షం కావడంతో భక్తులు ఆందోళన చెందారు. 

గతంలోనూ ఇక్కడ మొసలి కనిపించింది. కార్తీక మాసం సందర్భంగా ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న క్రమంలో మొసలి సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. వెంటనే దానిని పట్టుకోవాలని ఫారెస్ట్​ అధికారులను కోరుతున్నారు.