
నీళ్లలోనా మొసలి నిడిగి ఏనుగు పట్టు.. బయట కుక్క చేత భంగపడును.. ఇదీ చిన్నప్పుడు మనం చదువుకున్న పద్యం. బయటే కాదు.. నీళ్లలోనా అది భంగపడింది. కొండచిలువకు ఆహారంగా మారిపోయింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఉన్న మౌంట్ ఇసాలో ఓ నీటి కుంటలో ఉన్న మొసలిని బయటకు జరజరా ఈడ్చుకొచ్చి, చుట్టేసి హాంఫట్ అనిపించేసింది. దాని భోజనాన్ని కయాకర్ మార్టిన్ ముల్లర్ అనే ఫొటోగ్రాఫర్ కెమెరాలో బంధించేశాడు. ఈ ఫొటోలను జీజీ వైల్డ్‌లైఫ్ రెస్క్యూ ఐఎన్‌సీ అనే సంస్థ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. నెటిజన్లు లైకుల మీద లైకులు కొట్టేశారు ఈ ఫొటోలకు.