
- ఈసారి సాగు విస్తీర్ణం కొత్తగూడెంలో తగ్గింది.. ఖమ్మంలో పెరిగింది!
- గోదావరి వరదల తర్వాత వరి, మిర్చి సాగు పెరిగే అవకాశం..
భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి వరి సాగు తగ్గింది. పత్తిసాగు పెరిగింది. మొత్తం పంటల విస్తీర్ణం గతేడాది కంటే ఈసారి భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో తగ్గగా, ఖమ్మం జిల్లాలో పెరిగింది.
ఎక్కడెక్కడా ఏ పరిస్థితి?
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో గతేడాది 5,91,714 ఎకరాల్లో పంటల సాగు జరిగింది. కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు 5,37,645.89 ఎకరాల్లో పంట సాగైనట్టుగా అగ్రికల్చర్ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. గతేడాదితో పోలిస్తే 54,069 ఎకరాల్లో పంట సాగు తగ్గింది. వరితో పాటు కొన్ని పంటలకు సంబంధించి నారు వేస్తున్నారని ఆఫీసర్లు తెలుపుతున్నారు. వరి నాట్లు ఇంకా పడుతున్నాయని పేర్కొంటున్నారు.
ఖమ్మం జిల్లాలో గతేడాది 5,53,757.07 ఎకరాల్లో పంట సాగైంది. ఈ సీజన్లో 6,14,992 ఎకరాల్లో పంట సాగైంది. గతేడాదితో పోలిస్తే ఈ సారి దాదాపు 61,234.93 ఎకరాల్లో అధికంగా సాగు నమోదు కావడం విశేషం. కాగా, గతేడాదితో పోలిస్తే జిల్లాలో వరి, మొక్కజొన్న సాగు తగ్గగా పత్తి, చెరుకు, కంది, జీలుగు వంటి పంటల సాగు పెరిగింది.
వరదల తర్వాత పెరిగే చాన్స్..
జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో గోదావరి వరదల తర్వాతనే ఎక్కువ మంది రైతులు సాగును మొదలు పెడతారు. ఈ క్రమంలో మిర్చితో పాటు వరి సాగు ఇంకా పెరిగే అవకాశం ఉంది. జులై, ఆగస్టులో వర్షాలు, వరదలతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో పంట నష్టం తీవ్రంగా ఉంటుంది. దీంతో వరదల అనంతరం రైతులు సాగుకు మొగ్గు
చూపుతారు.
ఇంకా నాట్లు పడాల్సి ఉంది.. .
జిల్లాలో వరి సాగు ఇంకా పెరిగే అవకాశం ఉంది. వాతావరణ పరిస్థితులతో పంటల సాగులో కొంత మార్పు వచ్చింది. గోదావరి బెల్ట్‌లో మిర్చితో పాటు వరి నాట్లు పడాల్సి ఉంది. - బాబూరావు, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్
పెరిగిన పంటల వివరాలు..
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో..
పంటలు 2024-24 2025-26 (ఎకరాలలో)
పత్తి 2,03,560.36 2,13,437.22 9,876.86
మొక్కజొన్న 85,827 92,078 6,251
కంది 1,135 1,569.2 434.2
జీలుగు 5,365 9,415 4,050
పెసలు 128 362 234
ఖమ్మం జిల్లాలో :
పత్తి 207945.32 225032 17086.68
చెరుకు 270.36 474 203.64
గ్రీన్ గ్రామ్ 756.04 18251 17494.96
జీలుగు 28401 88401 60000
కంది 270 592.28 322.28
తగ్గిన పంటల వివరాలు..
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో...
పంటలు 2024-24 2025-26 (ఎకరాలలో)
వరి 1,64,662 1,39,450 25,212
మినుములు 840 392 448
వేరుశనగ 2,736 000 2,736
రెడ్ చిల్లీస్ 10,283 000 10,283
ఇతరత్రా 14,439 1,826 12,613
ఖమ్మం జిల్లాలో..
వరి 2,91,689.07 2,75126 16563.07
మొక్కజొన్న 2,775.07 1648 1127.07