
అకాల వర్షాలతో నిజామాబాద్, నారాయణపేట జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నియోజకవర్గంలోని మక్తల్, మాగనూరు, కృష్ణ, నర్వ, ఊట్కూరు మండలాల్లో దాదాపు 18 వేల ఎకరాల్లో వరి, 21 వేల ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలతో కష్టపడి పండిచిన పంట నేలవాలిందని ఆవేదన చెందుతున్నారు రైతులు. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షాలు తమను నిండా ముంచాయని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. అటు పంట నష్టం పై వివరాలు తెలుసుకుంటున్నామన్నారు వ్యవసాయ శాఖ అధికారులు. పంట నష్ట వివరాలను ప్రభుత్వానికి పంపి ఆదుకుంటామని చెబుతున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలతో కోతకొచ్చిన పంట నీటిపాలవ్వగా… తడిసిన ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం, దళారులు ముందుకు రావడం లేదంటున్నారు రైతులు. దీంతో రోజుల తరబడి ధాన్యాన్ని రోడ్లపై ఆరబెడుతున్నామని చెబుతున్నారు. వర్షాల, అడవి పందుల భారీ నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.