
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులు.. వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షానికి చాలా చోట్ల రైతులు పంట నష్టపోయారు. ముఖ్యం గా పొట్టకు వచ్చిన వరి, ఇపుడే కాతకు వచ్చిన మామిడి పంటలు బాగా దెబ్బతి న్నాయని బాధిత రైతులు చెబుతున్నారు. కరీంనగర్ లో 700 ఎకరాలు, జగిత్యాలలో రెండు వేల ఎకరాలు, సిరిసిల్ల జిల్లాలో 700 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ధర్మపురి, బుగ్గా రం, కొడిమ్యాల, మల్యాల, జగిత్యాల రూరల్, గొల్లపల్లి మండలాల్లో మామిడి, నువ్వు చేను , వరి, అరటి, బొప్పాయి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలు చోట్ల చెట్లు రోడ్లమీద కూలాయి. పలు ప్రాంతాల్లో వైర్లు తెగిపడ్డాయి. జగిత్యాల జిల్లాలో సుమారుగా రెండు వేల ఎకరాల్లో వడగళ్ల వానకు పంటలకు నష్టం వాటిల్లింది. సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పరిధిలో భారీగా వడగండ్ల వర్షం కురిసింది. బోయినపల్లి మండలం లోని పలు గ్రామాల్లో 500 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. వేములవాడ మండలంలో 200 ఎకరాలు.. వరి పంటకు, కొన్ని ప్రాంతాల్లో మామిడిజతోటల్లో కాయలు నేలరాలాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. తీవ్రగాలులకు ఎత్తైన చెట్లు రోడ్ల మీద పడిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఆయా గ్రామాల్లో కరెంట్సరఫరాను కొన్ని గంటల పాటు నిలిపి వేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చందుర్తి మండలంలో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. కరీంనగర్ గంగాధర , రామడుగుమండలాల్లో దాదాపుగా అన్ని గ్రామాల్లో వడగళ్ల వాన పడింది. గంగాధర లో సుమారు 500జఎకరాలు, రామడుగులో 200 ఎకరాల్లో వరి పంట నష్టపోయినట్లు రైతులు తెలిపారు.
మండుటెండలో రాళ్ళవాన
దండేపల్లి, వెలుగు : మండలాల్లో వడగండ్ల వాన కురిసింది సూర్యతాపానికి అల్లాడిన జనం కురిసిన రాళ్ల వాన తో బెంబేలెత్తిపోయారు. సాధారణంగా సూర్య తాపం ఎక్కువ ఉన్నప్పుడు వర్షం పడితే సంతోషిస్తా రు. కానీ ఈ అకాల రాళ్ల వానతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వానతో స్వల్పం గా ఉష్ణోగ్రతలు తగ్గాయి.
లక్షెట్టిపేటలో..
లక్షెట్టిపేట, వెలుగు : మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో బుధవారం సాయంత్రం చిరుజల్లులు కురిసాయి. కొన్ని గ్రామాల్లో రాళ్ల వాన కురిసింది. ఒక్కసారిగా విపరీతమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వాన కురవడంతో అటు ప్రజలు, ఇటు రోడ్డుపై చిరువ్యాపారులు కాస్త ఇబ్బం కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎలాంటి నష్టం వాటిల్లలేదు.