అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనతో అంతర్జాతీయంగా చమురు ధరలు దిగొచ్చాయి. చమురు రవాణాకు కీలకమైన హార్ముల్ జలసంధి తెరుచుకునే అవకాశాలు కనిపిస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా తగ్గాయి. ఒక బ్యారెల్ చమురు ధర రూ. 95.05కు తగ్గింది. మరోవైపు ట్రంప్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు కూడా లాభపడ్డాయి.
అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం, హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు అంగీకరించడంతో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. దీంతో దేశీయ మార్కెట్లు సూచీలు భారీ లాభాలతో ప్రారంభయ్యాయి. సెన్సెక్స్ 2,700 పాయింట్లకు పైగా, నిఫ్టీ 800 పాయింట్లకిపైగా లాభల్లో ట్రేడ్ అవుతున్నాయి. అటు ఆసియా మార్కెట్లు కూడా భారీగా పుంజుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భయాందోళలు నెలకొన్న సమయంలో ట్రంప్ సీజ్ఫైర్ ప్రకటనతో మొత్తం మారిపోయింది.
ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల కంటే దిగువకు పడిపోయాయి. అమెరికా ముడి చమురు ఫ్యూచర్స్ 18శాతం క్షీణించి బారెల్‌కు 92.60 డాలర్లకు దిగివచ్చింది. అంతర్జాతీయ ప్రమాణమైన బ్రెంట్ క్రూడ్ 6శాతం తగ్గి 103.40 డాలర్లకు తగ్గింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు రవాణాకు కీలకమైన హార్ముల్ జలసంధి ఇరాన్ మూసివేయడంతోచమురు ఉత్పత్తి, రవాణాకు ఆటంకం కలగడంతో ఇప్పటివరకు ధరలు పెరుగుతూ వచ్చాయి. తాజాగా హార్ముజ్ ను తెరుస్తామని ఇరాన్ ప్రకటన, సీజ్ ఫైర్ కు ట్రంప్ ఓకే చెప్పడంతో చమురుధరలు దిగొచ్చాయి.
