
న్యూఢిల్లీ: ప్రపంచంలోని వివిధ క్రిప్టో ఎక్స్చేంజిల్లో ట్రేడవుతున్న టాప్ 15 క్రిప్టోలతో కలిపి ఓ గ్లోబల్ ఇండెక్స్‌ను లాంచ్ చేస్తామని క్రిప్టోవైర్ ప్రకటించింది. ఐసీ15 పేరుతో తెస్తున్న ఈ ఇండెక్స్‌లో ఎక్కువగా ట్రేడవుతున్న, లిక్విడిటీ ఎక్కువగా ఉన్న క్రిప్టోలను లిస్ట్ చేస్తారు. క్రిప్టో ఇండస్ట్రీలోని 80 శాతం కదలికలను ఈ ఇండెక్స్ ట్రాక్ చేస్తుందని క్రిప్టోవైర్ వివరించింది. సరియైన నిర్ణయాలను తీసుకోవడానికి, పారదర్శకతను పెంచేందుకు ఈ ఇండెక్స్ సాయపడుతుందని అభిప్రాయపడింది. ఐసీ15 ఇండెక్స్‌ను ఇండస్ట్రీ ఎక్స్‌పర్టులు, డొమైన్ ఎక్స్‌పర్టులు మరికొంత మంది ప్రతి క్వార్టర్‌లో రీబ్యాలెన్స్ చేస్తారని క్రిప్టోవైర్ ప్రకటించింది. 2018, ఏప్రిల్ 1 ను బేస్ డేట్‌గా తీసుకొని, ఇండెక్స్ బేస్ వాల్యూని 10 వేలుగా నిర్ణయించామని పేర్కొంది. బిట్‌కాయిన్, ఎథరమ్, ఎక్స్‌ఆర్‌పీ, బిట్‌కాయిన్ క్యాష్, కార్డానో, లైట్‌కాయిన్, బినాన్స్ కాయిన్, చైన్‌లింక్, పోల్కడాట్, యూనిస్వాప్, డోజ్‌కాయిన్, సోలనా, టెర్రా, అవలాంచ్, షియా ఇను వంటి క్రిప్టోలు ఐసీ15 ఇండెక్స్‌లో ఉంటాయి. కాగా, తాజా వింటర్ పార్లమెంట్ సెషన్‌లో క్రిప్టో బిల్లును తేవాలని ప్రభుత్వం చూసింది. కానీ, ఈ బిల్లును ప్రవేశ పెట్టలేదు.