
- అధికారులకు సీఎస్ రామకృష్ణ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: తాగునీటి సమస్యపై ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించి, పరిష్కరించాలని అధికారులను సీఎస్ రామకృష్ణ ఆదేశించారు. సోమవారం మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో శుద్ధి చేసిన తాగునీటిని అందించాలని అధికారులకు సూచించారు. రోజువారీ సర ఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు.
సమస్యాత్మక గ్రామాలు, అటవీ ప్రాంతాలు, ఆదివాసీ గూడేలు, లంబాడీ తండాలు అధికంగా ఉండే ఆదిలాబాద్, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి తదితర జిల్లాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. జలాశయాల్లో నీటి మట్టాలను ఎప్పటి కప్పుడు పర్యవేక్షిస్తూ నీటి కొరత లేకుండా చూడాలన్నారు.