గోల్కొండ కోటలో పంద్రాగస్టు రిహార్సల్స్... పరిశీలించిన సీఎస్ రామకృష్ణారావు

గోల్కొండ కోటలో పంద్రాగస్టు రిహార్సల్స్... పరిశీలించిన సీఎస్ రామకృష్ణారావు

మెహిదీపట్నం, వెలుగు: గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం గోల్కొండ కోటను సందర్శించి, పోలీసుల ఫుల్ డ్రెస్ రిహార్సల్స్​ను పరిశీలించారు. జాతీయ జెండాను సీఎం రేవంత్​ రెడ్డి ఆవిష్కరించనుండగా, ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. వర్ష సూచనల నేపథ్యంలో వాటర్‌‌‌‌ ప్రూఫ్ షెడ్లు, మెడికల్ క్యాంపులు, గ్యాలరీలు, జనరేటర్లు, పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్స్, ఎల్‌‌‌‌ఈడీ స్క్రీన్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, ప్రోటోకాల్, భద్రత, ప్రజల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. 

విద్యుత్, జీహెచ్‌‌‌‌ఎంసీ, హెచ్‌‌‌‌ఎండీఏ, రెవెన్యూ, వైద్య శాఖల అధికారులు ఈ సందర్భంగా ఏర్పాట్లు పూర్తయినట్లు సీఎస్​కు నివేదించారు. వేడుకలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ ఆదేశించారు. 

వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్‌‌‌‌రావు, డీజీపీ డాక్టర్ జితేందర్, జీహెచ్‌‌‌‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఐఅండ్​పీఆర్ కమిషనర్ ప్రియాంక, అదనపు డీజీపీలు మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్, డీజీ ప్రిజన్స్ సౌమ్య మిశ్రా, డీజీ ఫైర్ సర్వీసెస్ నాగిరెడ్డి, ప్రోటోకాల్ డైరెక్టర్ శివలింగయ్య, కలెక్టర్ హరిచందన ఉన్నారు.