6 నెలల్లో 100 శాతం అక్షరాస్యత సాధిస్తాం

6 నెలల్లో 100 శాతం అక్షరాస్యత సాధిస్తాం

ఆరు నెలల్లో వంద శాతం అక్షరాస్యత సాధిస్తామన్నారు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్. శాసన మండలి ఆవరణలో మాట్లాడిన ఆయన తెలంగాణలో  నిరక్షరాస్యత మచ్చలాంటిదన్నారు.  దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉందన్నారు. ఈ ఆర్థిక మాంద్యంను అధిగమించేందుకు సీఎం కేసీఆర్  సబ్ కమిటీ ఏర్పాటు చేశారన్నారు.  సచివాలయం కూల్చివేత పై సంబంధిత శాఖ అధికారులు కోర్టుకు నివేదిక రూపొందిస్తున్నారన్నారు.  త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. పల్లె ప్రగతి చాలా మంచి కార్యక్రమం అని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పల్లెలు అభివృద్ధి చెందుతాయన్నారు సోమేశ్.