
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయల్ టెక్నాలజీ(సీఎస్ఐఆర్ ఐఎంటీఈసీహెచ్) ప్రాజెక్ట్ అసోసియేట్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 21.
పోస్టులు: 02 (ప్రాజెక్ట్ అసోసియేట్ -I)
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో నేచురల్/ అగ్రికల్చర్/ ఫార్మాసూటికల్ సైన్సెస్/ ఎంవీఎస్సీ/ యానిమల్ సైన్సెస్లో మాస్టర్ డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ లేదా మెడిసిన్లో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్లు ప్రారంభం: జులై 08.
లాస్ట్ డేట్: జులై 21.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు imtech.res.in వెబ్సైట్లో సంప్రదించగలరు.