CSK New Jersey: సినిమా రేంజ్లో CSK కొత్త జెర్సీ ఆవిష్కరణ.. రుతురాజ్ యాక్టింగ్, ధోనీ మాస్ ఎంట్రీ అదుర్స్

CSK New Jersey: సినిమా రేంజ్లో CSK కొత్త జెర్సీ ఆవిష్కరణ.. రుతురాజ్ యాక్టింగ్, ధోనీ మాస్ ఎంట్రీ అదుర్స్

CSK New Jersey: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న క్యాష్ రిచ్ లీగ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు (సీఎస్‌కే) తమ కొత్త జెర్సీని ఆవిష్కరించి.. అయితే సీఎస్‌కే యాజమాన్యం అభిమానుల కోసం ఓ వీడియో విడుదల చేసింది. అందులో మహేంద్ర సింగ్ ధోనీ జెర్సీ నెంబర్  ‘7’ కి సంబంధించిన 2026 కొత్త జెర్సీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. దీంతో ఈ వీడియోను చెన్నై టీమ్ అభిమానులు నెట్టింట తెగ రీపోస్టులు పెడుతున్నారు.  

కొత్త డిజైన్‌లో పాత గుర్తింపు: 
2026 జెర్సీ సీఎస్‌కే సంప్రదాయ పసుపు రంగును కొనసాగించింది. అయితే డిజైన్‌లో కొన్ని మార్పులు చేసింది. ఇంతకు ముందు స్లీవ్స్‌పై ఉన్న కేమోఫ్లాజ్ ప్యాటర్న్‌ను ఈసారి ముందు భాగంలో బోల్డ్ స్ట్రైప్స్‌గా మార్చింది. సీఎస్‌కే లోగోపై ఐదు నక్షత్రాలు ఉండగా, అవి 2010, 2011, 2018, 2021, 2023లో సాధించిన ఐదు టైటిళ్లను సూచిస్తున్నాయి.

►ALSO READ | T20 World Cup: మా హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్లో మళ్లీ అడుతాం.. సౌతాఫ్రికా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

గత సీజన్ నిరాశ: 
గత ఐపీఎల్ సీజన్‌లో సీఎస్‌కే ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచింది. 2025లో 14 మ్యాచ్‌ల్లో 10 ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. దీంతో 2026 సీజన్‌కు ముందు జట్టులో కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను ట్రేడ్ చేసి రాజస్థాన్ రాయల్స్ నుంచి వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకుంది. అలాగే యువ ఆటగాళ్లు ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలను తుది జట్టులో చేర్చుకుంది. రుతురాజ్ గైక్వాడ్ మరోసారి జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఆరో టైటిల్ లక్ష్యంగా సీఎస్‌కే సన్నద్ధమవుతోంది.

ప్రాక్టీస్ క్యాంప్ స్టార్ట్: 
ఆదివారం నుంచి సీఎస్‌కే తమ ప్రిపరేషన్ క్యాంప్‌ను స్టార్ట్ చేసింది. చెన్నైలోని హై-పర్ఫార్మెన్స్ సెంటర్‌లో జరిగే ఈ శిబిరానికి సుమారు 15 మంది భారతీయ ఆటగాళ్లు హాజరయ్యారు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్‌లో ఆడుతున్న సంజూ శాంసన్, శివమ్ దూబే టోర్నీ ముగిసిన తర్వాత క్యాంప్‌కు రానున్నారు. రంజీ ట్రోఫీ ఫైనల్లో ఆడిన శ్రేయస్ గోపాల్ కూడా త్వరలోనే జట్టుతో కలవనున్నాడు.