
చెన్నై: వరుస విజయాలతో దూసుకెళ్తూ లీగ్‌లో అందరికంటే ముందే ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకోవాలని ఆశించిన చెన్నై సూపర్ కింగ్స్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ చెక్ పెట్టింది. సూపర్ బౌలింగ్‌కు తోడు నితీష్ రాణా (44 బాల్స్‌లో 6 ఫోర్లు,1సిక్స్‌తో 57 నాటౌట్ ), రింకూ సింగ్ (43 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 54) చెలరేగడంతో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో చెన్నైని ఓడించింది. బ్యాటింగ్‌లో తడబడిన సీఎస్కే తొలుత 20 ఓవర్లలో 144/6 స్కోరు చేసింది. శివం దూబే (34 బాల్స్‌లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 48 నాటౌట్) టాప్ స్కోరర్. వరుణ్ చక్రవర్తి, నరైన్ చెరో రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో కేకేఆర్18.3 ఓవర్లలో 147/4 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. రాణా, రింకూ నాలుగో వికెట్‌కు 99 రన్స్ జోడించారు. దీపక్ చహర్ 3 వికెట్లు పడగొట్టాడు. రింకూ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
బౌలర్ల జోరు
ఓపెనర్లు రుతురాజ్ (17), డేవాన్ కాన్వే (30) తొలి వికెట్‌కు 31 రన్స్ జోడించి మంచి ఆరంభమే ఇచ్చినా వరుసగా వికెట్లు తీసిన కేకేఆర్ బౌలర్లు సీఎస్కేను చిన్న స్కోరుకే పరిమితం చేశారు. నాలుగో ఓవర్లో రుతురాజ్‌ను ఔట్ చేసిన చక్రవర్తి.. ఫోర్, సిక్స్‌తో ఊపు మీద కనిపించిన రహానె (16)ను ఎనిమిదో ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. శార్దూల్ దెబ్బకు కాన్వే ఔటవగా.. స్పిన్నర్ నరైన్ బౌలింగ్‌లో రాయుడు (4), మొయిన్ అలీ (1) క్లీన్ బౌల్డ్ అయ్యారు. దాంతో 11 ఓవర్లకు సీఎస్కే 72/5తో డీలా పడ్డది. ఈ దశలో ఇన్నింగ్స్ బాధ్యత తీసుకున్న దూబే, జడేజా (20) జాగ్రత్తగా ఆడుతూ స్కోరు వంద దాటించారు. చివర్లో కాస్త జోరు పెంచారు. స్పిన్నర్లు సుయాశ్, చక్రవర్తి వేసిన 17, 18వ ఓవర్లలో వరుసగా 16, 15 రాబట్టి ఇన్నింగ్స్‌లో జోష్ నింపారు. కానీ, 19వ ఓవర్లో శార్దూల్ ఐదు రన్సే ఇవ్వగా.. చివరి ఓవర్లో వైభవ్.. జడేజాను ఔట్ చేసి 9 రన్స్ఇచ్చాడు. కెప్టెన్ ధోనీ (2 నాటౌట్) నోబాల్ సహా 3 బాల్స్ ఆడి రెండే రన్స్ చేయడంతో సీఎస్కే 150 మార్కు కూడా అందుకోలేకపోయింది.
ఈ సీజన్‌లో చెపాక్ స్టేడియంలో సీఎస్కేకు ఇదే చివరి పోరు. మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనీ ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ.. సిబ్బందికి ఆటోగ్రాఫ్స్ ఇచ్చాడు.
గెలిపించిన రాణా, రింకూ
న్న టార్గెట్ ఛేజింగ్‌లో ఆరంభంలో తడబడినా రాణా, రింకూ మెరుపులతో కేకేఆర్ ఈజీగా గెలిచింది. స్టార్టింగ్‌లో సీఎస్కే పేసర్ దీపక్ చహర్ ఆ టీమ్‌ను వణికించాడు. పవర్ ప్లేలో వరుసగా మూడు ఓవర్లు వేసిన చహర్ ఓవర్‌కు ఒకరిని చొప్పున గుర్బాజ్ (1), ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ (9), జేసన్ రాయ్ (12)ను పెవిలియన్ చేర్చాడు. దాంతో, కేకేఆర్ 33/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ రాణా, రింకూ సింగ్ జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నారు. స్ట్రయిక్ రొటేట్ చేస్తూనే క్రమం తప్పకుండా బౌండ్రీలు కొట్టారు. మొయిన్ అలీ వేసిన 11వ ఓవర్లో రాణా ఇచ్చిన కష్టమైన క్యాచ్‌ను పతిరణ డ్రాప్ చేశాడు. అప్పటికి 18 రన్స్ వద్ద ఉన్న రాణా ఈ లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్నాడు. జడేజా వరుస ఓవర్లలో రింకూ రెండు సిక్సర్లు కొట్టగా.. అలీ, పతిరణ బౌలింగ్‌లో నాలుగు ఫోర్లతో రాణా జోరు పెంచాడు. ఈ క్రమంలో రింకూ 39 బాల్స్‌లో, రాణా 37 బాల్స్‌లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. విజయానికి 13 రన్స్ ముంగిట రింకూ రనౌటైనా రసెల్ (2 నాటౌట్) తో కలిసి రాణా లాంఛనం ముగించాడు.