IPL 2024: కొన్ని గంటల్లో చెన్నై, బెంగళూరు మ్యాచ్.. తుది జట్టు ఇదే

IPL 2024: కొన్ని గంటల్లో చెన్నై, బెంగళూరు మ్యాచ్.. తుది జట్టు ఇదే

ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఆ రోజు రానే వచ్చింది. నెలలు, రోజులు కౌంట్ డౌన్ పోయి ఇప్పుడు గంటలు లెక్కపెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. నేడు (మార్చి 22) జరగనున్న తొలి సమరంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది.  చెన్నై చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో ఆసక్తికరంగా మారింది. అంతకముందు ఈ మ్యాచ్ తుది జట్ల వివరాలను ఒకసారి పరిశీలిద్దాం. 

చెన్నై సూపర్ కింగ్స్(అంచనా):

గాయం కారణంగా కాన్వే దూరం కావడంతో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచీన్ రవీంద్ర ఈ మ్యాచ్ లో ఓపెనింగ్ చేయడం దాదాపుగా ఖాయమైంది. గత సీజన్ లో అదరగొట్టయిన రహానే నెంబర్ 3 లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. 14 కోట్ల వీరుడు డారిల్ మిచెల్ నాలుగో స్థానంలో వస్తాడు. ఆ తర్వాత వరుసగా దూబే, జడేజా, ధోనీ 5,6,7 స్థానాల్లో ఆడతారు. ఆల్ రౌండర్ శార్దూలు ఠాకూర్ 8 వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. దీపక్ చాహర్, తీక్షణ, ముస్తాఫిజార్ రహ్మాన్ స్పెషలిస్ట్ బౌలర్లుగా ఉండే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్లుగా యువ ప్లేయర్ సమీర్ రిజ్వి లేదా  ఫాస్ట్ బౌలర్ ముకేశ్ చౌదరీ ఆడే ఛాన్స్ ఉంది. 

బెంగళూరు (అంచనా ):

గత సీజన్ మాదిరిగానే కెప్టెన్ డుప్లెసిస్ తో పాటు విరాట్ కోహ్లీ ఓపెనర్ గా బరిలోకి దిగుతాడు. రూ.17 కోట్ల భారీ ధరకు దక్కించుకున్న కామెరూన్ గ్రీన్ మూడో ప్లేస్ లో.. రజత్ పటిదార్ నాలుగో స్థానాల్లో ఆడటం దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. ఇక మిడిల్ ఆర్డర్ లో బ్యాట్ ఝళిపించేందుకు మ్యాక్స్ వెల్, దినేష్ కార్తిక్, మహిపాల్ లోమరోర్ సిద్ధంగా ఉన్నారు. ఆల్ రౌండర్ మయాంక్ దగర్, పేస్ బౌలర్లుగా మహమ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గుసన్,ఆకాష్ దీప్ లకు బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్లుగా స్పిన్నర్ కరణ్ శర్మ లేదా బ్యాటర్ ప్రభుదేశాయిలలో ఒకరు ఆడొచ్చు.