కూరగాయల సాగు పెరగాలె: మంత్రి నిరంజన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

కూరగాయల సాగు పెరగాలె: మంత్రి నిరంజన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం, ఉత్పత్తి మరింత పెరగా ల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. సాగును పెం చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై స్టడీ చేసి రిపోర్ట్​ అందించాలని హార్టికల్చర్‌‌‌‌‌‌‌‌ అధికారులను ఆయన ఆదేశించారు. గురువారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో కూరగాయల సాగుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. కూరగాయల విత్తన ధరలు, మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. పండించిన కూరగాయల నిల్వకు చర్యలు తీసుకోవాలన్నారు. డిమాండ్‌‌‌‌‌‌‌‌ పెరుగుతూ, ఉత్పత్తి తగ్గుతున్న నేపథ్యంలో దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా అధ్యయనం చేసి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, కొత్త జిల్లా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సాగు పెంచాలన్నారు. 
ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాలన్నారు. నివేదికను సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రంలో కూరగాయల సాగుకు సమ్రగ ప్రణాళిక రూపొందిస్తామని మంత్రి వెల్లడించారు.