
చాలా మంది ఇళ్లల్లో పెరుగు త్వరగా రడీ కాదు.. ఒక వేళ రడీ అయినా.. పుల్లగానో.. టేస్ట్ లేకుండా ఉంటుంది. అలాంటి వారు పెరుగును తోడు పెట్టే పద్దతిని మార్చుకోవాలట. పెరుగు త్వరగా తోడుకొనేందుకు.. టేస్ట్ సూపర్ గా ఉండేందుకు పాటించాల్సిన కిచెన్ టిప్స్ గురించి తెలుసుకుందాం. . . .
- పెరుగు త్వరగా తోడుకోవాలంటే..ప్లేట్లో కొన్ని గోరు వెచ్చని నీళ్లు పోసి అందులో తోడు వేసిన పాల గిన్నె పెడితే టేస్టీ పెరుగు తక్కువ టైంలోనే రెడీ అవుతుంది.
- పెరుగు త్వరగా తోడుకోవాలంటే తోడు వేసిన గిన్నెను మరొక గిన్నెలో పెట్టి మూత పెట్టాలి.
- తోడు పెట్టే గిన్నె అడుగున పెరుగు వేశాక పాలు పోయాలి. తర్వాత ఆ మిశ్రమంలో పచ్చిమిర్చి ముంచాలి. ఇలా చేస్తే రెండుమూడు గంటల్లోనే చిక్కటి పెరుగు తోడుకుంటుంది. ఎండుమిర్చి తుంచి వేసినా త్వరగా తోడుకుంటుంది. ఎండుమిర్చి వల్ల పెరుగు పులుపు రాదు.
- తోడు పెట్టాక కవ్వంతో కాసేపు చిలికితే పెరుగు త్వరగా తోడుకుంటుంది