CNPలో 534 టెక్నీషియన్, సూపర్వైజర్ పోస్టులు.. ఐటీఐ, డిప్లొమా/డిగ్రీ పాసైతే జాబ్ మీకే..

CNPలో 534 టెక్నీషియన్, సూపర్వైజర్ పోస్టులు.. ఐటీఐ, డిప్లొమా/డిగ్రీ  పాసైతే జాబ్ మీకే..

కరెన్సీ నోట్ ప్రెస్ నాసిక్ (సీఎన్​పీ నాసిక్, ఎస్​పీఎంసీఐఎల్) జూనియర్ టెక్నీషియన్, సూపర్‌వైజర్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 20న ప్రారంభమై, మే 19న ముగియనున్నది.

మొత్తం ఖాళీలు: 534. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, సోషల్ వర్క్​లో డిగ్రీ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 30 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్​ 20.

లాస్ట్ డేట్: మే 19. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్  cnpnashik.spmcil.comను సందర్శించండి.