బయోస్పియర్ రిజర్వులు..
- 1992లో యూఎన్ఓ ఆధ్వర్యంలో బ్రెజిల్‌లోని రియోడి జనీరోలో జరిగిన ధరిత్రి సమావేశంలో 171 దేశాల భాగస్వామ్యంతో జీవ వైవిధ్య ఒప్పందం జరిగింది.
- ఈ ఒప్పందం ప్రకారం ఆవాసాంతర రక్షణ, ఆవాసేతర రక్షణ చేపడతారు.
- ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జీవజాతులను అవే సహజసిద్ధ పరిసరాల్లో సంరక్షించడాన్ని ఆవాసాంతర రక్షణ అంటారు.
- ఆవాసాంతర రక్షణలో భాగంగా బయోస్పియర్ రిజర్వులు, జాతీయ పార్కులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
- బయోస్పియర్ రిజర్వుల్లో జంతువులతోపాటు అన్నిరకాల జీవజాతులను పరిరక్షిస్తారు. ఇక్కడ టూరిజాన్ని అనుమతించరు.
- దేశంలో మొత్తం 18 బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి.
- దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి (తమిళనాడు). దీనిని 1986లో ఏర్పాటు చేశారు.
- దేశంలో చివరిగా ప్రకటించిన బయోస్పియర్ రిజర్వ్ పన్నా (మధ్యప్రదేశ్).
- యునెస్కో జాబితాలో దేశంలోని 12 బయోస్పియర్ రిజర్వులను చేర్చారు (ప్రస్తుత లెక్కల ప్రకారం).
- బయోస్పియర్ రిజర్వుల కోసం యునెస్కో ఎంఏబీ( మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్) అనే కార్యక్రమం ప్రారంభించింది.
- దేశంలో అతిపెద్ద బయోస్పియర్ రన్ ఆఫ్ కచ్ (12,454 చ.కి.మీ.).
- దేశంలో అతి చిన్న బయోస్పియర్ దిబ్రూ-సైఖోవా (అస్సాం).
జాతీయ పార్కులు
- జాతీయ పార్కుల్లో జంతువులను సహజంగా రక్షిస్తారు. ఇక్కడ వేట, ప్రైవేట్ కార్యకలాపాలు, కలప సేకరణ నిషేధం.
- దేశంలో ఏర్పాటు చేసిన మొదటి జాతీయ పార్క్ - హేలీ (1936). ఆ తర్వాత దీనిని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని పిలుస్తున్నారు.
- ప్రస్తుతం దేశంలో 106 జాతీయ పార్కులు ఉన్నాయి.
- దేశంలో అత్యధికంగా అండమాన్ నికోబార్ (9), మధ్యప్రదేశ్ (9)ల్లో ఉన్నాయి.
వన్యమృగ సంరక్షణ కేంద్రాలు
- వన్యమృగ సంరక్షణ కేంద్రాల్లో అంతరించిపోయే జీవజాతులను సంరక్షిస్తారు. ఇక్కడ పరిమితంగా అనుమతులు ఉంటాయి.
- దేశంలో ప్రస్తుతం 560కి పైగా వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి.
- దేశంలో మొదటి పక్షి సంరక్షణ కేంద్రం వేదాంతంగల్ (తమిళనాడు).
దేశంలో పెద్ద వన్యప్రాణి సంరక్షణ
- కేంద్రం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ శాంక్చువరీ (మహారాష్ట్ర).
- తెలంగాణలో కాసు బ్రహ్మానందరెడ్డి, కవ్వాల్, మృగవని, ఏటూరు నాగారం, మహావీర్ హరిణ వనస్థలి, పోచారం, పాకాల, మంజీరలలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి.
- ఏదైనా భౌగోళిక ప్రాంతంలో అంతరించిపోయే స్థితిలో ఉన్న జీవజాతులను వాటి సహజ సిద్ధ పరిసరాలకు వెలుపల మానవ ప్రమేయంతో సంరక్షించే విధానాన్ని ఆవాసేతర రక్షణ అంటారు.
- ప్రపంచంలో ఇప్పటివరకు 36 ఎకలాజికల్ హాట్‌స్పాట్లను గుర్తించారు.
- దేశంలో ఈశాన్య హిమాలయాలు, పశ్చిమ కనుమలను ఎకలాజికల్ హాట్స్పాట్లుగా గుర్తించారు.
- మాజులీ దీవిని ఎకో సెన్సిటివ్ జోన్‌గా గుర్తించారు.
- జల్దాపారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఉంది.
- ప్రఖ్యాతిగాంచిన కన్హా వన్యమృగ సంరక్షణ కేంద్రం మధ్యప్రదేశ్‌లో ఉంది.
- కర్ణాటకలోని బందీపూర్ జాతీయ పార్క్ వన్యప్రాణుల సంరక్షణకు ప్రసిద్ధి.
- దేశంలో అత్యధిక జీవవైవిధ్యం పశ్చిమ కనుమలలో ఉంది.
- మధ్యప్రదేశ్‌లోని పన్నా నేషనల్ పార్క్ గుండా కెన్ నది ప్రవహిస్తోంది.
- దేశంలో శ్రీశైలం (నాగార్జునసాగర్ - శ్రీశైలం) వన్యప్రాణి సంరక్షణ స్థలం అన్నిటికంటే పెద్దదైన పులుల సంరక్షణ కేంద్రం.
- దేశంలో ప్రాజెక్ట్ టైగర్ పథకం 1973లో ప్రారంభమైంది.