ఫస్ట్ డే బిజినెస్ ​డల్..మాల్స్,రెస్టారెంట్లలో కనిపించని కస్టమర్లు

ఫస్ట్ డే బిజినెస్ ​డల్..మాల్స్,రెస్టారెంట్లలో కనిపించని కస్టమర్లు

హైదరాబాద్, వెలుగుమాల్స్ లో షాపింగ్ సందడి కనిపించలేదు. రెస్టారెంట్లలో తినేందుకు కస్టమర్స్ రాలేదు. ఆలయాలకు వచ్చిన భక్తులు అంతంత మాత్రమే. ఇదీ సోమవారం సిటీలో కనిపించిన సీన్. రెండున్నర నెలల తర్వాత తిరిగి ఓపెన్‌‌‌‌‌‌‌‌చేసినా ఎక్కడా లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌కు ముందునాటి జోష్​ కానరాలే. అన్నిచోట్లా సేఫ్టీ ప్రికాషన్స్​ తీసుకుంటున్నా జనాలు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. కరోనా రాక ముందు డైలీ ఒక్కో మాల్‌‌‌‌‌‌‌‌ని  3 వేల నుంచి 5 వేల మంది విజిట్ చేసేవారు. కానీ వైరస్ ఎఫెక్ట్​తో 500 మందిలోపే వచ్చారని మాల్స్ నిర్వాహకులు చెప్పారు.  రెస్టారెంట్స్ 50 శాతం మాత్రమే తెరుచుకున్నా వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. ఫస్ట్​డే ఎక్కడా అంత రద్దీ కనిపించలేదు.

వర్కర్స్​ లేక.. తెరుచుకోలే

సిటీలో పదుల సంఖ్యలో మాల్స్ ఉండగా, ఒక్కోదానిలో150కి పైగానే విభిన్న స్టోర్స్, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. మొదటిరోజు కొన్ని స్టోర్స్ నిర్వాహకులు తెరిచేందుకు ఇంట్రెస్ట్​ చూపలేదు. ఓపెన్ స్టోర్స్ లో 10 మందికి పైగా కస్టమర్స్ షాపింగ్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కొన్నివారాలుగా రెస్టారెంట్స్, హోటల్స్ టేక్ అవే స్టార్ట్​చేశాయి. అన్నింటికి సర్కార్ ​గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినా చాలా చోట్ల రెస్టారెంట్స్ ఓపెన్ చేయలేదు. వర్కర్స్ లేకపోవడం, ఓపెన్ చేసినా కస్టమర్స్ రారనే ఉద్దేశంతో దాదాపు 50 శాతానికి పైగా తెరుచుకోలేదు. ఓపెన్ ​చేసిన వాటిలో జనం లేక ఖాళీగా కనిపించగా, మొదటి రోజు బిజినెస్​ డల్​ అయ్యింది.

డిస్పోజబుల్​ మెనూ కార్డులున్నా..

టేబుల్స్ మధ్య డిస్టెన్స్, స్టాఫ్ కి మాస్క్ లు, షీల్డ్ లు, గ్లౌజ్ లతో పాటు కిచెన్ లోనూ తగు జాగ్రత్తలు తీసుకున్నారు. డిస్పోజబుల్ మెను కార్డ్, సెల్ఫ్ సర్వీసింగ్ ని ప్రొవైడ్ చేశారు.  కొన్ని రెస్టారెంట్స్ మాత్రం సెక్షన్స్ వైజ్ గా ఓపెన్ చేశాయి. కానీ మొదటిరోజు కస్టమర్స్ అంతగా రాలేదని, టేక్ అవే ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయని రెస్టారెంట్స్ నిర్వాహకులు చెప్పారు.  ఓపెన్ చేసినా బిజినెస్ జరగదని, ఎక్స్ ట్రా ఖర్చులు అవుతాయనే ఆలోచనతోనే సగానికి పైగా ఓపెన్​ చేయలేదని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్​రెడ్డి తెలిపారు. ఇప్పటికే  రెంట్, మెయింటెనెన్స్ కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నారని, కస్టమర్లు రాకపోతే  ప్రాబ్లమ్స్‌‌‌‌‌‌‌‌పెరుగుతాయని చెప్పారు.  కరెంట్ బిల్స్, టైమింగ్స్, ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్‌‌‌‌‌‌‌‌విషయంలో ప్రభుత్వం సాయం అందించాలని కోరారు.

ఆలయాలకూ అంతంతే..

రెండున్నర నెలల తర్వాత తెరుచుకున్న టెంపుల్స్​కు భక్తులు పెద్దగా రాలేదు. ప్రధాన ఆలయాలైన కీసర రామలింగేశ్వరస్వామి, జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి, తాడ్​బండ్ వీరాంజనేయస్వామి, సికింద్రాబాద్ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, దిల్​సుఖ్​నగర్, పంజాగుట్ట సాయిబాబా, హిమాయత్​నగర్​ టీటీడీ దేవాలయాల్లో అంతంత మాత్రంగానే కనిపించారు. అన్నిచోట్ల థర్మల్​స్క్రీనింగ్, శానిటైజర్​ అందుబాటులో ఉంచారు. ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వచ్చిన ఓ వృద్ధురాలు(65)ని ఆలయ నిర్వాహకులు అనుమతించలేదు. దీంతో బయట నుంచే అమ్మవారిని దర్శించుకుని వెళ్లిపోయింది. సికింద్రాబాద్​ సెయింట్​మేరీ చర్చికి భక్తులు వచ్చారు. కొన్నిచోట్ల ఫిజికల్​ డిస్టెన్స్ ను పాటించలేదు.

వీకెండ్స్ లో వస్తారనుకుంటున్నాం

కొన్ని వారాల నుంచి టేక్ అవే అందిస్తున్నాం. వర్కర్లంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారే. లాక్ డౌన్ తో ఊళ్లకు పోయారు. ఉన్నవారికి  అకామిడేషన్ కల్పించాం. డైనింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. డిస్పోజబుల్ మెనూ ఉంచాం. కస్టమర్స్ సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలని చెబుతున్నాం. ఈరోజు కస్టమర్స్ ఎక్కువగా రాలేదు. వీకెండ్స్ లో వస్తారనుకుంటున్నాం.

‑ వేణుధర్, సంబల్ రెస్టారెంట్, మాదాపూర్

 

లాక్ డౌన్ తో రేట్ల మోత