
శంషాబాద్ విమానాశ్రయం బంగారం అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లర్లు కొత్త కొత్త రూట్లతో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నారు. తాజాగా షార్జా నుంచి వచ్చిన మహ్మద్ నజీర్... బంగారాన్ని చేతి గడియారంలో పెట్టి తీసుకొచ్చాడు. కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేసి అతన్ని అరెస్ట్ చేసి, 233 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.11.50 లక్షలు ఉంటుందన్నారు అధికారులు.