IND vs PAK: కోటి డెబ్భై లక్షల మంది.. తొలి ఓవర్‌లోనే రికార్డులు బద్దలు

IND vs PAK: కోటి డెబ్భై లక్షల మంది.. తొలి ఓవర్‌లోనే రికార్డులు బద్దలు

ప్రపంచ కప్‌లో అసలు సిసలు సమరం భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ వ్యూయర్‌షిప్‌ పరంగా సరికొత్త రికార్డులు నెలకొల్పేలా కనిపిస్తోంది. ఆట ప్రారంభమై తొలి ఓవర్‌ మొదటి బంతి పడే సమయానికి రికార్డు స్థాయిలో కోటి డెబ్భై లక్షల మంది హాట్‌స్టార్‌లో మ్యాచ్‌ను వీక్షించారు. ఓటీటీ చరిత్రలో తొలి ఓవర్‌లో ఈస్థాయిలో మ్యాచ్‌ను వీక్షించడం ఇదే మొదటిసారి. పది ఓవర్లు ముగిసేసరికి ఆ సంఖ్య 2.5 కోట్లకు చేరుకుంది. ఇలానే కొనసాగితే వ్యూయర్‌షిప్‌ పరంగా ఈ మ్యాచ్‌ ఆల్‌టైమ్‌ రికార్డులు బద్దలుకొట్టడం ఖాయమన్న మాటలు వినిపిస్తున్నాయి.

ధాటిగా ఆడుతున్న పాకిస్తాన్..

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన పాక్ బ్యాటర్లు ధాటిగా ఆడుతున్నారు. బుమ్రా వేసిన తొలి ఓవర్‌లో ఒక బౌండరీ మాత్రమే రాగా.. సిరాజ్ వేసిన రెండో ఓవర్‌లో ఇమామ్‌ ఉల్‌ హాక్‌ ఏకంగా మూడు బౌండరీలు బాదాడు. పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టానికి 49 పరుగులు చేసిన పాక్.. 12 ఓవర్ పూర్తయ్యేసరికి 68 పరుగులు చేసింది. ఇమామ్‌ ఉల్‌ హాక్‌ (32), బాబర్ ఆజాం (15) క్రీజులో ఉన్నారు. 

సిరాజ్‌ 5 ఓవర్లలో 27 పరుగులు సమర్పించుకోగా.. బుమ్రా 4 ఓవర్లలో ఓ మెయిడిన్‌ వేసి 14 పరుగులు ఇచ్చాడు.