Cricket World Cup 2023: ఇండియా vs పాకిస్తాన్.. బ్లూ కలర్‌లో లక్ష మంది భారత సైన్యం

Cricket World Cup 2023: ఇండియా vs పాకిస్తాన్.. బ్లూ కలర్‌లో లక్ష మంది భారత సైన్యం

క్రికెట్‌ ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. అహ్మదాబాద్ గడ్డపై దాయాదుల సమరం మొదలైపోయింది. టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ.. పాకిస్తాన్‌ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ స్థానంలో గిల్‌ను తుది జట్టులోకి తీసుకోగా.. పాక్ జట్టు ఎలాంటి మార్పులు చేయలేదు. క్రికెట్‌ ప్రపంచకప్‌లోనే మదర్ అఫ్ ఆల్ గేమ్ అని పిలుచుకునే ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ కావడంతో అభిమానులు పోటెత్తారు.

కాలం మారింది.. క్రికెట్‌ ఆడే తీరు మారింది. గతంతో పోలిస్తే భారత్‌-పాక్‌ మ్యాచ్‌లంటే ఉండే ఉద్విగ్న వాతావరణంలోనూ మార్పు వచ్చింది. ఆటగాళ్లు కూడా చాలా స్నేహపూర్వకంగా  మెలుగుతున్నారు. కానీ, ఇరు దేశాల అభిమానుల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటం కోసం ఎగబడిపోయారు. ఏకంగా లక్షా ముప్పైవేల మంది హాజరయ్యారు. 

భారత జెర్సీలు ధరించిన లక్ష మంది

క్రికెట్‌లోనే అత్యున్నత టోర్నీ అందునా.. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే అభిమానులున్న దేశం.. మన మాతృభూమి. మరి ఆ ఇష్టం ఎలా ఉంటుందో దాయాది దేశానికి చూపెట్టాలి కదా!  అందుకే ఈ మ్యాచ్‌కు హాజరైన లక్షా ముప్పైవేల మంది అభిమానుల్లో దాదాపు లక్ష మందు భారత జెర్సీలు ధరించారు. స్టేడియం మొత్తం టీమిండియా జెర్సీ కలర్‌ బ్లూ రంగులో మెరిసిపోతోంది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.