
బషీర్బాగ్, వెలుగు: ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా ఓ యువకుడిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. మెహదీపట్నం గుడిమల్కాపూర్ కు చెందిన 24 ఏళ్ల యువకుడికి హింజ్ అనే డేటింగ్ యాప్ లో శివాని పేరుతో ఓ యువతి పరిచయం అయింది. తాను పుణె నుంచి హైదరాబాద్ కు వచ్చానని, మూడు రోజుల పాటు నగరంలో ఉంటానని తెలిపింది. చనువు పెంచుకుని వీడియో కాల్లో మాట్లాడింది. ఆ తరువాత అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి అందరికీ షేర్ చేస్తామని బెదిరించారు. భయపడిన బాధితుడు పలు దఫాలుగా రూ.లక్షా 80 వేలు బదిలీ చేశాడు. అంతటితో ఆగకుండా మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.