ఘరానా మోసగాళ్లు: లోన్ ఆఫర్ చేసి.. రూ.3 లక్షలు కాజేసిన స్కామర్స్

ఘరానా మోసగాళ్లు: లోన్ ఆఫర్ చేసి.. రూ.3 లక్షలు కాజేసిన స్కామర్స్

బషీర్​బాగ్, వెలుగు: లోన్ ఆఫర్​చేసిన స్కామర్స్​ఓ వ్యక్తి వద్ద నుంచి రూ.3 లక్షలు కాజేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్ గూడకు చెందిన వ్యక్తికి గత నెల 11న స్కామర్​ఫోన్ చేశాడు. బజాజ్ ఫిన్ సర్వ్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి రూ.లక్ష లోన్ ఇస్తానన్నాడు. 

బాధితుడు ఆసక్తి చూపడంతో.. ఫైనాన్స్ ఏజెంట్లమంటూ కొంత మంది కాల్స్ చేశారు. లోన్ ప్రాసెస్ చేయడానికి ఇన్సూరెన్స్ , టీడీఎస్ , ఎన్ వోసీ, జీఎస్టీ , ఆర్బీఐ మెయిల్, అకౌంట్ ట్రాన్స్​ఫర్ చార్జెస్, లోన్ యాక్టివేషన్ , లేట్ ఫీజు, అడ్వాన్స్ ఈఎంఐ , క్యాష్ డిపాజిట్ చార్జి వంటి కొన్ని పేమెంట్స్​చేయాలని.. శాంక్షన్ అయ్యాక ఆ డబ్బులను తిరిగి చెలిస్తామని నమ్మబలికారు. 

బాధితుడు నమ్మి.. మొత్తం రూ.3.04 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత కూడా వారు డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో ఇది స్కాం అని గ్రహించాడు. మంగళవారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు.