
వనపర్తి, వెలుగు : సైబర్ నేరగాళ్లు ఏకంగా కలెక్టర్ ఫొటోనే వాడుకుంటూ ఆఫీసర్ల నుంచి డబ్బులు అడుగుతున్నారు. వివరాల్లోకి వెళ్తే... వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఫొటోను +84 329196048 అనే నంబర్‌కు వాట్సప్ ప్రొఫెల్ డీపీగా పెట్టి ఓ ఆఫీసర్‌ను డబ్బులు అడిగిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. ఈ విషయం కాస్త వైరల్‌గా మారడంతో అలాంటి మెసేజ్‌లకు ఎవరూ స్పందించవద్దని కలెక్టర్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.