నా పేరుతో ఫేక్ అకౌంట్స్.. వెంటనే ఈ నంబర్లను బ్లాక్ చెయ్యండి: సీపీ సజ్జనార్

నా పేరుతో ఫేక్ అకౌంట్స్.. వెంటనే ఈ నంబర్లను బ్లాక్ చెయ్యండి: సీపీ సజ్జనార్

 రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్నాయి.ఫేక్ అకౌంట్స్ తో .. ఆన్ లైన్ ఇన్వెస్ట్ మెంట్స్, అధిక వడ్డీలు, జాబ్ ల పేరుతో  ఇలా రకరకాల ఆన్ లైన్ మోసాలు  వెలుగులోకి వస్తున్నాయి.

 కొందరు బడాబాబులు,రాజకీయ నాయకులు, సెలబ్రిటీల పేర్లతో అందిన కాడికి దోచుకుంటున్నారు.పలానా మంత్రి తెలుసు..ఎమ్మెల్యే మా బంధువు..పోలీస్ ఆఫీసర్ తెలుసని..మరి కొందరు ఏకంగా జిల్లా కలెక్టర్లు.. పోలీసు ఆఫీసర్ల ఫోటోలను వాట్సప్,ఫేస్ బుక్ డీపీలుగా మార్చి  సొమ్ము చేసుకుంటున్నారు. వ్యక్తిగత వివరాలు అడుగడం..తర్వాత సోషల్ మీడియా ద్వారా లింక్స్ దొరికిన కాడికి దోచుకుంటున్నారు. 

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేరుతో సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్స్, ఫేక్ వాట్సప్ డీపీలు పెట్టి  చాట్ చేస్తున్నారు.   ఈ క్రమంలో సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని  హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఫేక్ డీపీలు, ఫోటోలు,ముఖం చూసి మోసపోవద్దని సూచించారు. 

►ALSO READ | కార్తీకమాసం నదుల్లో స్నానం చేస్తే ఎలాంటి శక్తి వస్తుంది.. పురాణాల్లో ఏముంది..!

వాట్సాప్ లో డీపీగా నా ఫోటోను పెట్టుకుని తెలిసిన వాళ్లకు సందేశాలు పంపిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇవి నకిలీ ఖాతాలు. పూర్తిగా మోసపూరితమైనవి. ఇలాంటి సందేశాలకు స్పందించకండి. ఆ నంబర్లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. సైబర్ నేరగాళ్లకు మీ వ్యక్తిగత వివరాలను అసలే ఇవ్వొద్దు. డబ్బులు అడిగితే పంపించొద్దు. సైబర్ మోసగాళ్లకు మీ జాగ్రత్తే అడ్డుకట్టనే విషయం మరచిపోవద్దు. నకిలీ వాట్సాప్ ఖాతాలు మీ దృష్టికి వస్తే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 కు కాల్ చేసి సమాచారం ఇవ్వండి. అలాగే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. అని సజ్జనార్ తన ఎక్స్ లో పోస్ట్ చేశారు.