
హైదరాబాద్: ప్రపంచ యాత్రికుడు అన్వేష్పై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ DGP జితేందర్, మెట్రో MD ఎన్ వి ఎస్ రెడ్డి, శాంత కుమారి, దాన కిషోర్, వికాస్ రాజ్పై అన్వేష్ ఆరోపణలు చేశాడు. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసి 300 కోట్లు కొట్టేసారంటూ అన్వేష్ వీడియో విడుదల చేశాడు.
ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేశాడంటూ అన్వేష్పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. రూ.300 కోట్లు లంచం తీసుకొని మూడు బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారని సీనియర్ అధికారుల పేర్లను అన్వేష్ వెల్లడించాడు. ప్రపంచ యాత్రికుడు అవినాష్పై పలు సెక్షన్ల కింద సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
డీజీపీ, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ఎస్ రెడ్డితో పాటు మాజీ సీఎస్ శాంతికుమారి, ఐఏఎస్‌లపై బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌తో రూ.300 కోట్లు కొట్టేశారని అన్వేష్ వీడియో చేశాడు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని కానిస్టేబుల్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు అన్వేష్‌పై సుమోటోగా కేసు నమోదు చేశారు.