ఉక్రెయిన్ పై సైబర్ దాడులు

ఉక్రెయిన్ పై సైబర్ దాడులు

బోస్టన్: ఓవైపు రష్యా మిలటరీ ఆపరేషన్ తో సతమతమవుతున్న ఉక్రెయిన్.. మరో ప్రమాదంలో చిక్కుకుంది. ఆ దేశంపై సైబర్ దాడులు జరుగుతున్నా యి. ఇప్పటికే కొన్ని గవర్నమెంట్, బ్యాంకింగ్ వెబ్ సైట్లు క్రాష్ అయ్యాయి. దేశంలోని వందలాది కంప్యూటర్లలో ‘‘వైపర్’’ మాల్ వేర్ ఉన్నట్లు రీసెర్చర్లు గుర్తించారు. డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీస్ (డీడీఓఎస్) అటాక్ లతో వెబ్ సైట్లు క్రాష్ అయ్యాయని చెప్పారు. బుధవారం నుంచి సైబర్ దాడులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇది రష్యా పనేనని ఆరోపించారు. ఇదే ఏడాదిలో ఇంతకుముందు రెండుసార్లు కూడా సైబర్ దాడులు చేసిందని పేర్కొన్నారు. రెండు నెలల ముందు నుంచే సైబర్ దాడులకు ప్లాన్ చేసిందని, పోయినేడాది డిసెంబర్ లో మాల్ వేర్ ను తయారు చేసిందని వెల్లడించారు. మరిన్ని సైబర్ అటాక్స్ జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. కాగా, వైపర్ మాల్ వేర్ సిస్టమ్ లోని డేటాను పూర్తిగా తొలగిస్తుంది. దాన్ని తిరిగి రికవరీ చేయడం కష్టమవుతుంది. ఇక డీడీఓఎస్ వెబ్ సైట్లను క్రాష్ చేస్తుంది.