
సైబర్ నేరగాళ్లు చిన్న చిన్న వారిని పట్టుకుంటే చిన్న అమౌంట్ వస్తుందని అనుకుంటున్నారో ఏమో కానీ ఈ మధ్య ఐఏఎస్, ఐపీఎస్ వంటి అధికారులను పట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎస్పీ. కలెక్టర్ వంటి అధికారులమని చలాయిస్తూ ఓ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు పంపాలని లేకపోతే అరెస్టు చేసి జైలుకు పంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.
సూర్యాపేట జిల్లా ఎస్పీ పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతాను తెరిచారు సైబర్ నేరగాళ్లు. నకిలీ ఖాతా నుంచి మెసేజ్లు, ప్రెండ్ రిక్వెస్టులు పంపుతూ అమాయకపు ప్రజలను తమ బుట్టలో వేసుకోవాలని స్కెచ్ వేశారు.. తన పేరు మీద ఫేస్ బుక్ అకౌంట్ తో డబ్బులు వసూత్ చేస్తున్నారని తెలుసుకున్న ఎస్పీ రాహుల్ హెగ్దే స్పందించారు.
ఎస్పీ సూర్యాపేట నుంచి వచ్చే మెసేజ్లకు ఎవ్వరూ స్పందించవద్దని కోరారు. ఎవరూ డబ్బులు పంపవద్దన్న సూచించారు. నకిలీ ఖాతాలను క్రియేట్ చేసిన వారిపైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాహుల్ తెలిపారు.
ఇదే విధంగా వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్లో నకిలీ ఖాతా సృష్టించారు. తాను మీటింగ్ లో ఉన్నానని, అర్జెంట్ డబ్బులు కావాలంటూ శ్రీలంక దేశానికి చెందిన +94776414080 అనే నంబర్ నుంచి కలెక్టర్ ప్రావీణ్య పేరుతో సైబర్ నేరగాళ్లు పలువురికి మేసేజ్లు పంపించారు.
డబ్బులు ఫోన్ పే చేసి, స్ర్కీన్ షాట్ షేర్ చేయాలని సైబర్ నేరగాళ్లుషయం తెలుసుకున్న కలెక్టర్ ప్రావీణ్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అసలు ఫేస్బుక్ అకౌంట్ ద్వారా అందరినీ అప్రమత్తం చేశారు. తన పేరుతో ఎవరూ డబ్బులు అడిగినా ఇవ్వొద్దని కలెక్టర్ సూచించారు.