అవహేళన చేసినవాళ్ళను తలదించుకునేలా చేశారు

అవహేళన చేసినవాళ్ళను తలదించుకునేలా చేశారు

సైబరాబాద్ కమిషనరేట్‌ పరిధిలో ఘనంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్‌లో అడిషనల్ డిప్యూటీ కమిషనర్ (క్రైమ్స్) కవిత.. జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘జనవరి 26, 1950 నాడు మనకు రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆ సందర్భంగానే మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. పరాయి పరిపాలనలో మనం బ్రతుకుతున్నప్పుడు మన స్వాతంత్ర్య సమరయోధులు అందరూ ఏకమై జనవరి 26, 1950 నాడు మన భారత దేశానికి గణతంత్ర దినోత్సవాన్ని తీసుకు వచ్చిన రోజు. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ వారు మనల్ని హేళన చేశారు. మీకు స్వాతంత్రం వచ్చింది కానీ, మీరు రాజ్యాంగం ఏవిధంగా నడిపించుకుంటారో చూస్తాం అని హెచ్చరించారు. అయినా మన స్వాతంత్ర్య యోధులు పట్టువదలకుండా రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చి .. బ్రిటిష్ వాళ్లు తలదించుకునేలా చేశారు. అప్పటినుంచి మన భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా చరిత్రపుటల్లో నిలిచిపోయింది. అప్పుడు మన స్వాతంత్ర్య సమరయోధులు తీసుకువచ్చిన రాజ్యాంగం ద్వారానే మనం ఇప్పుడు కుల, మత భేదం లేకుండా బతుకుతున్నాం. అందువల్లే భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది. దేశం కోసం పోరాడిన ఎందరో మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు సాగుదాం. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

For More News..

జాతీయగీతాన్ని సెల్‌ఫోన్‌లో చూస్తూ పాడిన మండలాధికారి

వారి సంపాదన పంచితే మనిషికి రూ. 94 వేలు వస్తాయి

అక్కాచెల్లెళ్ల హత్య కేసు అప్‌డేట్: కలషంలో నవధాన్యాలు పోసి.. నోట్లో పెట్టి కొట్టి చంపిన తల్లి

ఒక్క మెసేజ్​తో రూ. 42 లక్షలు కొట్టేసిండు

స్కూల్ వంటమనిషికి పద్మశ్రీ అవార్డ్