ఫేక్ లీగల్​ నోటీసులు.. మీరు కంపెనీ రూల్స్ బ్రేక్ చేశారు ఫైన్ కట్టండి

ఫేక్ లీగల్​ నోటీసులు.. మీరు కంపెనీ రూల్స్ బ్రేక్ చేశారు ఫైన్ కట్టండి
  •     ఫేక్ లీగల్​ నోటీసులు పంపి బెదిరిస్తున్న సైబర్ గ్యాంగ్ 
  •     పార్ట్ టైమ్ జాబ్​ల పేరుతో  మోసం
  •     25 రాష్ట్రాల్లో బాధితుల నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు
  •     నలుగురు నిందితుల అరెస్ట్

గచ్చిబౌలి, వెలుగు :  పార్ట్​టైం జాబ్​ల పేరుతో రిక్రూట్ చేసుకుని వర్క్ సరిగా చేయట్లేదంటూ ఫేక్ లీగల్ నోటీసులు పంపి డబ్బులు వసూలు చేస్తున్న నలుగురిని సైబరాబాద్ సైబర్​క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు దేశంలోని 25 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో బాధితుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైబరాబాద్ పరిధిలో ఉండే ఓ యువతి పార్ట్ టైమ్ జాబ్ కోసం ఎదురుచూస్తోంది.

కొంతకాలం కిందట ఆమెకు ఫ్లోరా సొల్యూషన్స్​ అనే కంపెనీలో క్యాప్చా  టైపింగ్​ వర్క్​ పేరిట పార్ట్​టైం జాబ్ ఆఫర్ అంటూ వాట్సాప్​లో మెసేజ్ వచ్చింది.  ఆ యువతి జాబ్‌‌లో జాయిన్‌‌ అయ్యింది. లాగిన్ ​ఐడీ, పాస్​వర్డ్ ​ఇవ్వడంతో వర్క్ ​చేసి సబ్మిట్ చేసింది. మీరు సరిగా వర్క్ చేయలేదని కంపెనీ ప్రతినిధి చెప్పడంతో సదరు యువతి లాగ్​అవుట్​అయ్యింది.

కంపెనీ రూల్స్ బ్రేక్ చేశారంటూ ఆ యువతికి కంపెనీ ప్రతినిధి లీగల్ నోటీసులు పంపించి బెదిరించాడు.  చార్జీల పేరుతో యువతి నుంచి రూ.6 లక్షల 17 వేలు వసూలు  చేశాడు.  దీంతో బాధితురాలు సైబరాబాద్​ సైబర్ క్రైమ్ ​పోలీసులను ఆశ్రయించింది. 

ఇలా చీటింగ్‌‌ చేస్తరు.. 

రాహుల్​అశోక్​ భాయ్​(25), సాగర్​ పాటిల్​(24), కల్పేష్​ థోరట్​(26), నీలేష్​ పాటిల్​(24) ఈ నలుగురు  గుజరాత్‌‌ రాష్ట్రం సూరత్‌‌లోని దిండోలి గ్రామానికి చెందిన వారు. రాహుల్​ సూరత్‌‌లో  డేటా ఎంట్రీ కంపెనీలో టెలీకాలర్​గా పనిచేశాడు.  ఈ కాల్​సెంటర్​ ఓనర్​ నితీశ్‌‌ను అక్కడి పోలీసులు అరెస్టు చేయడంతో అది మూతపడింది.  దీంతో రాహుల్  మోసాలకు స్కెచ్ వేశాడు.  తన గ్రామానికి చెందిన క్లాస్‌‌

మేట్స్​ను సంప్రదించాడు. ఆన్​లైన్‌‌ పోర్టల్స్ ద్వారా జాబ్స్​ కోసం వెతుకుతున్న వారి వివరాలను సేకరించాడు. సాగర్ ​పాటిల్ ​టెలీకాలర్‌‌‌‌గా, కల్పేష్ అండ్​నీలేష్‌‌  బ్యాంక్​అకౌంట్లను సప్లయ్ చేశారు. ​ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తున్న వారికి రాహుల్ వాట్సాప్‌‌ ద్వారా ఫ్లోరా సొల్యూషన్‌‌ నుంచి పార్ట్‌‌ టైమ్ డేటా ఎంట్రీ పేరుతో జాబ్స్‌‌ ఆఫర్స్‌‌ అంటూ మెసేజ్‌‌లు పంపేవాడు.  స్పందించిన వారికి డేటా ఎంట్రీ జాబ్​పేరుతో లాగిన్ ఐడీ

పాస్‌‌వర్డ్‌‌ ఇచ్చి డేటా ఎంట్రీ వర్క్​ఇచ్చేవారు. ఎవరైతే జాబ్ లో​జాయిన్​అయ్యి వర్క్​ కంప్లీట్​చేసి సబ్మిట్​చేసిన తర్వాత..  ఆ వర్క్ సరిగా  చేయలేదని రాహుల్​వారితో చెప్పేవాడు.  ఒకవేళ లాగ్​అవుట్ చేస్తే కంపెనీ రూల్స్ పాటించలేదుంటూ ఫేక్​ లీగల్ నోటీసులు పంపించేవాడు. బెదిరించి వివిధ చార్జీల పేరుతో బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసేవాడు.

358 సైబర్ క్రైమ్ కేసుల్లో నిందితులు..

డేటా ఎంట్రీ జాబ్స్ పేరుతో చీటింగ్ చేస్తున్న ఈ నలుగురు నిందితులను సూరత్ సిటీలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ ​పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 6 సెల్ ఫోన్లు, ఓ ల్యాప్ టాప్, 5 డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. 358 సైబర్ క్రైమ్ కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారని.. తెలంగాణ రాష్ట్రంలోనే  ఈ గ్యాంగ్ పై 28 కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. సైబరాబాద్ పరిధిలో 11 కేసుల్లో ఈ నలుగురు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.