ఆధునిక పోలీ సింగ్ కు సైబరాబాద్ రోల్ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...డీజీపీ శివధర్ రెడ్డి 

ఆధునిక పోలీ సింగ్ కు సైబరాబాద్ రోల్ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...డీజీపీ శివధర్ రెడ్డి 

హైదరాబాద్​ సిటీ, వెలుగు: కట్టుదిట్టమైన పనితీరు, సమర్థతతో సైబరాబాద్​కమిషనరేట్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని డీజీపీ శివధర్ రెడ్డి కొనియాడారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ 24వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం టీ-హబ్​లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. 

సైబరాబాద్​కమిషనరేట్ ఆధునిక పోలీసింగ్​కు బలమైన పునాది వేసిందన్నారు. మాజీ డీజీపీలు మహేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సీపీ డా. రమేష్ తదితర ఉన్నతాధికారులు హాజరైన ఈ వేడుకల్లో కమిషనరేట్ సాధించిన 23 ఏళ్ల విజయాలను స్మరించుకున్నారు. సైబర్ భద్రత, ప్రజా సేవల్లో సైబరాబాద్ దేశానికే రోల్ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచిందని అధికారులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.