పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ వీసా.. సిబిల్ స్కోర్ పేరిట.. రూ. 2. 71 కోట్లు కొట్టేసిండు

పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ వీసా.. సిబిల్ స్కోర్ పేరిట.. రూ. 2. 71 కోట్లు కొట్టేసిండు
  • యువతులను మోసగించిన చీటర్ అరెస్ట్
  • మ్యాట్రిమోనిలో  ఫేక్‌‌‌‌ ప్రొఫైల్‌‌‌‌ క్రియేట్‌‌‌‌  
  • యాక్సెప్ట్ చేసిన మహిళలతో పెండ్లి పేరిట నమ్మించి.. మోసం
  • వారి పేరుతో లోన్లు తీసుకుని టోకరా
  • మోసగాడిని అరెస్టు చేసిన సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైం పోలీసులు 

గచ్చిబౌలి, వెలుగు: మ్యాట్రిమోని వెబ్​సైట్లలో ఫేక్‌‌‌‌ ప్రొఫైల్‌‌‌‌ క్రియేట్‌‌‌‌ చేశాడు. యాక్సెప్ట్‌‌‌‌ చేసిన యువతులను పెండ్లి పేరిట ఆకర్షించాడు. పార్ట్ నర్ వీసా, సిబిల్ స్కోర్ పేరిట లోన్లు తీసుకుని రూ. కోట్లలో డబ్బులు కొట్టేశాడు. ఇలా మోసపోయిన ఓ యువతి ఫిర్యాదుతో నిందితుడిని సైబరాబాద్‌‌‌‌ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైం పోలీసులు తెలిపిన ప్రకారం.. మదీనాగూడ ప్రాంతానికి చెందిన ఓ యువతి(30), పెండ్లి చేసుకోవాలనుకుని గత నవంబర్‌‌‌‌‌‌‌‌లో షాదీ.

కామ్ లో తన ప్రొఫైల్ అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసింది. ఆమెకు యూఎస్‌‌‌‌ రెసిడెంట్‌‌‌‌ రిషి కుమార్‌‌‌‌‌‌‌‌ గా.. తను గ్లెన్ మార్క్‌‌‌‌ ఫార్మా కంపెనీలో అసిస్టెంట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ ను అంటూ పరిచయం అయ్యాడు. అనంతరం ఇద్దరూ ఫోన్‌‌‌‌ కాల్స్‌‌‌‌, వాట్సాప్‌‌‌‌ కాల్స్‌‌‌‌ ద్వారా మాట్లాడుకున్నారు. పెండ్లి చేసుకుని అమెరికా రావాలంటే పార్ట్​నర్​వీసా ప్రాసెస్​ఉంటుందని నమ్మించాడు. తనకు వీసా రావాలంటే సిబిల్ స్కోర్​845 ఉండాలని, అయితే.. 743 ఉందని, ​స్కోర్​పెరగాలంటే లోన్లు తీసుకోవాలని యువతికి సూచించాడు. తన సంస్థ ద్వారా లోన్లు ఇప్పిస్తానని ఆమె బ్యాంకు అకౌంట్లు తీసుకుని క్రెడిట్‌‌‌‌ కార్డులు, కారు లోన్‌‌‌‌తో పాటు ఇతర లోన్లు తీసుకున్నాడు.

దీంతో పాటు ఆస్ర్టేలియాలో మైక్రోసాఫ్ట్​లో జాబ్ లు ఇప్పిస్తానని, తన బంధువు నిర్మల సంస్థలో బోర్డు మెంబర్​అని చెప్పిన రిషికుమార్​యువతి బంధువును కూడా నమ్మించాడు. ఆమె కూడా లోన్లు తీసుకునేలా ఒత్తిడి చేశాడు. తీసుకున్న లోన్ల డబ్బులు ఇవ్వకుండా చీటింగ్​చేసిన రిషికుమార్​పై చర్యలు తీసుకోవాలని మార్చి16న సైబరాబాద్​సైబర్​క్రైమ్​పోలీసులకు బాధిత యువతి ఫిర్యాదు చేసింది.

పార్ట్ నర్ వీసా పేరిట సిబిల్ ​స్కోర్​ పెరిగేందుకని.. తన పేరిట లోన్ గా తీసుకున్న మొత్తం రూ. 2  కోట్ల 71 లక్షల79 వేలు ఇప్పించాలని ఆమె కంప్లైంట్​లో పేర్కొంది.  సైబర్​ క్రైమ్​ పోలీసులు దర్యాప్తు చేప్టటారు. మ్యాట్రిమోని సైట్​లో పెండ్లి పేరిట యువతుల వద్ద వీసా, ఇతర కారణాల పేరిట డబ్బులు తీసుకొని చీటింగ్​చేస్తున్న విజయవాడ జిల్లా పెనమలూరు మండలం పోరంకి గ్రామానికి చెందిన పొట్లూరి శ్రీబాల వంశీకృష్ణ(37)గా గుర్తించి అరెస్ట్​ 
చేశారు. 

ఆన్​లైన్ ​బెట్టింగ్​లు, రేస్ ​కోర్సులు ఆడేందుకే..

ఆన్​లైన్​ బెట్టింగ్​లు, రేస్​ కోర్సుల ఆడేందుకు శ్రీబాల వంశీకృష్ణ బానిస అయ్యాడు. డబ్బుల కోసం మ్యాట్రిమోని వెబ్​సైట్లలో యువతులు, మహిళలను పెండ్లి పేరిట చీటింగ్‌‌‌‌ చేసేందుకు రూ.2500 పెట్టి షాదీ.కామ్​లో రిజిస్ర్టర్​అయ్యాడు. అందులో తన పేరిట ఐదారు ప్రొఫైల్స్​అప్ లోడ్ చేశాడు. ఎవరైనా తనకు రిక్వెస్ట్​పెడితే వారితో వాట్సప్​కాల్​ద్వారా మాట్లాడి కెరీర్, పెండ్లి విషయాలను చర్చిస్తాడు.  

తన ప్లాన్​లో భాగంగా యూఎస్​పార్ట్ నర్​వీసా లేదా సిబిల్​స్కోర్​తక్కువ ఉందని కథలు చెప్పి, వారి పేరిట లోన్లు తీసుకొని లక్షలు, కోట్లలో వసూలు చేసి తన విలాసాలకు ఖర్చు చేస్తాడు.  ఇలా శ్రీబాల వంశీకృష్ణపై సైబరాబాద్, హైదరాబాద్, విజయవాడ, రామగుండం, చెన్నైలో 9  కేసులు నమోదయ్యాయి. నిందితుడి నుంచి ఆరు బ్యాంక్​పాస్​బుక్​లు,10 డెబిట్​, క్రెడిట్​కార్డులు, మూడు సెల్​ఫోన్లు, నాలుగు సిమ్​కార్డులు స్వాధీనం చేసుకున్నారు.