ప్లాస్మా దాతలే రియల్ హీరోస్..

ప్లాస్మా దాతలే రియల్ హీరోస్..

హైదరాబాద్  : ప్లాస్మా దానం చేసేవాళ్లే రియల్ హీరోస్ అని డైరెక్టర్ రాజమౌళి అన్నారు. ప్లాస్మా దానం చేయడానికి భయపడకూడదన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ లో ప్లాస్మా డొనేట్ పై అవగాహన సదస్సు జరిగింది.  ఈ కార్యక్రమానికి   సైబరాబాద్ సీపీ  సజ్జనార్, డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ యంయం కీరవాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన  రాజమౌళి తాను కూడా ప్లాస్మా దానం చేస్తానన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేయడానికి ముందుకు వస్తున్నారన్నా.. కుటుంబ సభ్యులు భయపడుతున్నారన్నారు . ప్లాస్మా దానం చేయడం వల్ల ఏమి కాదని..ప్లాస్మా దానం చేసే వారిని ఎవరు ఆపొద్దన్నారు. ప్లాస్మా దానం అనేది డాక్టర్ చేతిలో ఉన్న బ్రహ్మస్రమన్నరు. ఎటువంటి అపోహలు లేకుండా ప్లాస్మా దానం  చేయాలన్నారు. కరోనా అనేది చంపేంతా పెద్ద వైరస్ కాదన్నారు. కరోనా వచ్చిన వారు ధైర్యంగా  పోరాడాలని కోరారు.

సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ప్లాస్మా డొనేట్ పై చాలా అపోహలు ఉన్నాయని..అందుకే ప్లాస్మా డొనేట్ పై అవర్నెస్ కల్పిస్తున్నామన్నారు. 450 మందికి పైగా ప్లాస్మా డొనేట్ చేసి 850 మంది ప్రాణాలు కాపాడమన్నారు. ప్లాస్మా డొనేట్ కార్యక్రమానికి భారీ స్పందన వస్తుందన్నారు. ఒకరు ప్లాస్మా దానం చేసి ఇద్దరు కరోనా పేషేంట్ ల ప్రాణాలు కాపాడవచ్చన్నారు.  ప్లాస్మా డొనేట్ కార్యక్రమానికి 50 మంది వాలంటరిలో పని చేస్తున్నారన్నారు. ప్లాస్మా దానం చేయండి, కరోనానును తరిమి కొట్టాలన్నారు. .

ప్లాస్మా సంజీవని లాంటిది : కీరవాణి

ప్లాస్మా డొనేట్ కార్యక్రమనేది గొప్ప కార్యక్రమమని కీరవాణి అన్నారు. తమ ఫ్యామిలీ లో అందరికి కరోనా వచ్చింద్నారు. తనకు కరోనా వస్తే హాస్పిటల్ లో  ట్రీట్ మెంట్ తీసుకున్నానన్నారు.ప్లాస్మా అనేది సంజీవని లాంటిదని…ప్లాస్మా దాతలు…ప్రాణ దాతలన్నారు. తమ కుటుంబ సభ్యులందరూ ప్లాస్మా దానం చేస్తున్నామన్నారు. కరోనా జయించిన వారు తప్పకుండా ప్లాస్మా దానం చేయాలన్నారు.