- బాధితుడి ఫ్రెండ్స్ కు షేర్ చేసిన సైబర్ నేరగాళ్లు
ఘట్కేసర్, వెలుగు : అడిగినంత డబ్బు ఇవ్వలేదని సైబర్‌నేరగాళ్లు సిటీకి చెందిన యువకుడి ఫొటోలను మార్ఫింగ్చేశారు. న్యూడ్ గా మార్చి, వాటిని అతని ఫ్రెండ్స్ కు షేర్చేశారు. ఘట్కేసర్సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్కు చెందిన ఇద్దరు యువకులు అన్నదమ్ములు. అన్న(25) ఎంటెక్, తమ్ముడు(25) బీటెక్చదువుతున్నారు. ఇటీవల తమ్ముడికి సైబర్‌నేరగాళ్లు ఫోన్‌చేశారు. ‘మీ అన్న మా లోన్‌యాప్ లో లోన్తీసుకున్నాడు. తిరిగి కట్టలేదు. చెల్లించకపోతే ఫొటోలు మార్ఫింగ్చేసి బంధువులు, స్నేహితులకు పంపిస్తాం.’ అని బెదిరించారు.
యువకుడు స్పందిస్తూ.. ‘మా అన్న తీసుకున్న లోన్క్లియర్చేశాడు. ఇంకెవరికీ కట్టాల్సిన అవసరం లేదు. ఏమి చేసుకుంటారో చేసుకోండి’ అని గట్టిగా చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన సైబర్‌నేరగాళ్లు సోషల్ యాప్స్‌లోని అకౌంట్ల నుంచి యువకుడి ఫొటోలను డౌన్లోడ్చేశారు. వాటిని న్యూడ్ఫొటోలుగా మార్ఫింగ్చేసి, అతని సోషల్‌మీడియా ఫ్రెండ్స్, వాట్సాప్కాంటాక్టులకు పంపించారు. ఫ్రెండ్స్ద్వారా విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
