వేములవాడలో ఫోన్‌‌‌‌‌‌‌‌ హ్యాక్‌‌‌‌‌‌‌‌ చేసి రూ. 13 లక్షలు మోసం

వేములవాడలో ఫోన్‌‌‌‌‌‌‌‌ హ్యాక్‌‌‌‌‌‌‌‌ చేసి రూ. 13 లక్షలు మోసం

వేములవాడ, వెలుగు : సైబర్‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లు ఓ వ్యక్తి ఫోన్‌‌‌‌‌‌‌‌ను హ్యాక్‌‌‌‌‌‌‌‌ చేసి అతడి అకౌంట్‌‌‌‌‌‌‌‌లో ఉన్న డబ్బును కాజేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని గాంధీనగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన అవునూరి భాస్కర్‌‌‌‌‌‌‌‌ గంగాధర మండలం బూరుగుపల్లిలో లైన్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. 

ఇతడి మొబైల్‌‌‌‌‌‌‌‌కు ఇటీవల ఓ ఏపీకే ఫైల్‌‌‌‌‌‌‌‌ రాగా దానిపై క్లిక్‌‌‌‌‌‌‌‌ చేశాడు. దీంతో అతడి మొబైల్‌‌‌‌‌‌‌‌ హ్యాక్‌‌‌‌‌‌‌‌ అయి.. వివరాలు మొత్తం సైబర్‌‌‌‌‌‌‌‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లింది. తర్వాత అతడి హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ, యూనియన్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ అకౌంట్ల నుంచి మొత్తం రూ. 13.25 లక్షలు కట్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. దీనిని గ్రహించిన బాధితుడు వెంటనే సైబర్‌‌‌‌‌‌‌‌ క్రైమ్‌‌‌‌‌‌‌‌ పోలీసులుక ఫిర్యాదు చేశాడు.