
- కాయిన్స్మార్పిడి పేరిట సైబర్‌నేరగాళ్ల కొత్త తరహా దోపిడీ
- అప్రమత్తంగా ఉండాలంటున్నసైబర్ సెక్యూరిటీ బ్యూరో
హైదరాబాద్, వెలుగు : సైబర్ నేరగాళ్లు ఓల్డ్ కాయిన్స్ మార్పిడి పేరుతో కొత్త తరహా దోపిడీకి తెర తీశారు. రూ.2 లేదా రూ.5 ఓల్డ్ కాయిన్స్ ఇచ్చి లక్షల రూపాయలు తీస్కోండి అంటూ ఆఫర్ చేస్తూ.. అందినంఓల్డ్ కాయిన్స్ ఇచ్చి.. లక్షలు తీస్కోండిత దోచేస్తున్నారు. ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఇలాంటి సైబర్ నేరాలను స్టేట్ సైబర్ క్రైమ్ బ్యూరో గుర్తించింది. కాయిన్స్ మార్పిడి పేరుతో వచ్చే ఎస్‌ఎమ్‌ఎస్, లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నది.
ఈ మేరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, ఇండియా మ్యాప్ కలిగిన రూ. 2 లేదా రూ. 5 కాయిన్స్ కావాలని సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో పోస్టింగ్స్ చేస్తున్నారని తెలిపారు. పురాతన నాణేలు కావడంతో మంచి డిమాండ్ ఉందని నమ్మిస్తూ, ఒక్కో నాణేనికి రూ.లక్షకు పైగా చెల్లిస్తామని సైబర్‌నేరగాళ్లు చెబుతున్నారని, వారి మాయలో పడిన వారి నుంచి కాయిన్స్ మార్పిడి చేసేందుకు టీడీఎస్, సర్వీస్ ఛార్జి సహా వివిధ రకాల ఛార్జీల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని శిఖాగోయల్తెలిపారు.
మోసాన్ని గ్రహించి డబ్బులు ఇవ్వడం నిలిపివేసిన వారిని మనీలాండరింగ్ కేసుల పేరుతో, పోలీసులు, ఈడీ, ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారుల పేర్లతో కాల్స్ చేసి బెదిరిస్తున్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కాయిన్స్ మార్పిడి పేరుతో కాల్స్, మెసేజ్‌లు వస్తే 1930 టోల్‌ఫ్రీ నంబర్ లేదా సైబర్ ఫ్రాడ్ రిజిస్ట్రీ వాట్సాప్ నంబర్ 87126 72222కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.