
రానున్న 24 గంటల్లో బిపార్జోయ్ తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు-మధ్య , ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన 'బిపార్జోయ్' తుఫాన్ ఉత్తరం వైపుకు మళ్లి, వచ్చే 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారుతుందని IMD తెలిపింది. దీని ప్రభావంతో లక్షద్వీప్, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది.
Also Read:డబుల్బెడ్రూం ఇళ్లు ఖాళీ చేయుమంటున్నరు..
135-145 kmph వేగంతో గాలులు వీస్తాయని.. రాబోయే మూడు నుండి నాలుగు రోజుల్లో 160 kmph వరకు ఉంటుందని ఐఎండీ హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించింది.
జూన్ 7న తూర్పు-మధ్య, పశ్చిమ- మధ్య ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాలపై గంటకు 100 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సాయంత్రం నాటికి, ఈ గాలులు 95 - 105 kmph వరకు తీవ్రమవుతాయని వెల్లడించింది. అదే ప్రాంతంలో 115 kmph వేగంతో గాలులు వీస్తాయని.. పశ్చిమ-మధ్య , దక్షిణ అరేబియా సముద్రానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలు, ఉత్తర కేరళ, కర్ణాటక, గోవా తీరాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది వాతావారణ శాఖ.