మిచాంగ్​ ఎఫెక్ట్​: తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు..

మిచాంగ్​ ఎఫెక్ట్​: తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు..

 మిచౌంగ్‌ తుపాను దూసుకొస్తోంది. సోమవారం ( డిసెంబర్​ 4)  కోస్తా తీరానికి సమాంతరంగా పయనించి.. రేపు మధ్యాహ్నం  డిసెంబర్​ 5) నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక, తెలంగాణపై కూడా తుపాను ప్రభావం చూపనుంది. దీంతో..  సోమ, మంగళ వారాలు ( డిసెంబర్​ 4,5తేదీలు)  పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

తుపాన్‌ ప్రభావం ఇలా..

  • తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్న గాలులు
     
  • సోమ, మంగళ ( డిసెంబర్​ 4,5 తేదీలు)  తెలంగాణవ్యాప్తంగా ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు
     
  • ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీచేసిన వాతావరణ శాఖ
     
  •  భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఎల్లో అలెర్ట్ జారీ
     
  • ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో వీచే అవకాశం
     
  • కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురు గాలులు
     
  • మంగళవారం ( డిసెంబర్​ 5)  జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఆరెంజ్ అలెర్ట్ జారీ
     
  • నల్గొండ, మహబూబాబాద్, వరంగల్ , హన్మకొండ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కి.మీల వేగంతో వీచే అవకాశం
     
  • మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
     
  •  తెలంగాణవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగే అవకాశం
     
  •  దట్టమైన పొగ మంచు ఉండే అవకాశం ఉంది.