అరేబియన్ సముద్రంలో వాయుగుండం : తెలంగాణలో రాబోయే 5 రోజులు వర్షాలు

అరేబియన్ సముద్రంలో వాయుగుండం : తెలంగాణలో రాబోయే 5 రోజులు వర్షాలు

ఎండాకాలమా.. వానాకాలమా.. అర్థం కాని పరిస్థితుల్లోకి మారింది వాతావరణం. మండే ఎండల టైంలో.. వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మరో బ్రేకింగ్ వెదర్ రిపోర్ట్ వచ్చేసింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడనుంది. ప్రస్తుతం ద్రోణి కొనసాగుతుండగా.. రాబోయే 12 గంటల్లో అది అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అంటే 2025, మే 21వ తేదీ అర్థరాత్రికి సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది రాబోయే 36 గంటల్లో.. అంటే 2025, మే 22వ తేదీ అర్థరాత్రికి వాయుగుండంగా మారనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. 

బంగాఖాతంలో ఏర్పడే వాయుగుండం వల్ల రాబోయే ఐదు రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయి. ఇక తెలంగాణలోనూ రాబోయే ఐదు రోజులు.. అంటే మే 26వ తేదీ వరకు వర్షాలు పడనున్నట్లు స్పష్టం చేసింది వెదర్ రిపోర్ట్. ఈ వర్షాలు ఈదురుగాలులతో ఉంటాయని.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయని వెల్లడించింది వాతావరణ శాఖ. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ వర్షాలు పడతాయని.. ఇప్పటికే కోదాడ, సూర్యాపేట, హుజూర్ నగర్ ఏరియాల్లో వర్షాలు పడుతున్నట్లు స్పష్టం చేసింది వాతావరణ శాఖ. 

తెలంగాణలోని పశ్చిమ, తూర్పు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని.. మొత్తం 15 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని కూడా హెచ్చరించింది వాతావరణ శాఖ. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్,  నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ బాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ప్రకటించింది వాతావరణ శాఖ. 

ప్రజలు.. ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని.. పంటలను కాపాడుకోవాలని సూచించింది.