అలర్ట్: తీవ్ర తుపానుగా మారిన నివర్

అలర్ట్: తీవ్ర తుపానుగా మారిన నివర్

కొన్ని గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనున్న నివర్

దక్షిణ కోస్తా.. రాయలసీమ జిల్లాలపై ప్రభావం

నెల్లూరు జిల్లాలో 3 రోజులు.. చిత్తూరు జిల్లాలో 2 రోజులపాటు స్కూళ్లకు సెలవులు

తమిళనాడు.. పుదుచ్చేరిలపై తీవ్ర ప్రభావం చూపనున్న నివర్ తుపాన్ తీవ్ర రూపం దాల్చింది. మరికొన్ని గంటల్లో అతితీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. వేగంగా తరుముకొస్తుండడంతో ఇప్పటికే తీరం వెంబడి గాలులు వీస్తున్నాయి. ప్రస్తుతం కడలూర్ కి తూర్పు ఆగ్నేయం 300 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 310 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి  370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం  అయింది. రాత్రికి తమిళనాడులోని మమాళ్లపురం- కరైకల్ మధ్య, పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తోంది. తీరందాటే సమయంలో దక్షిణకోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 65-85 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి.

నివర్ తుపాను ఎక్కువగా తమిళనాడు, పుదుచ్చేరి తోపాటు.. దక్షిణ కోస్తా.. రాయలసీమ జిల్లాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా. నివర్  ప్రభావంతో ఈ రోజు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. ముఖ్యంగా నెల్లూరు , చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో అధికారులు సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్ , ఎన్డీఆర్ఎఫ్  బృందాలు సిద్ధం చేశారు. తుపాను గమనాన్ని బట్టి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను , ప్రభుత్వ శాఖలను అప్రమత్తం  చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా నెల్లూరు జిల్లాలో 3 రోజులపాటు.. చిత్తూరు జిల్లాలో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కీలకమైన శాఖల్లో అధికారులు.. సిబ్బంది సెలవులు రద్దు చేశారు.

కృష్ణపట్నం పోర్టు వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

నివర్ తుపాను ప్రభావం అల్లకల్లోలం సృష్టించే అవకాశం ఉండడంతో కృష్ణపట్నం పోర్టు వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైతులు కూడా తుపాను నేపధ్యంలో వ్యవసాయ పనులలో అప్రమత్తంగా ఉండాలని.. వర్షాలతో ఇబ్బందిపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు.

for more News…

హైదరాబాద్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

ఆ ఊరిలో అమ్మాయి పుడితే 5వేలు డిపాజిట్.. పెద్దయ్యాక ఊరోళ్లే పెళ్లి కూడా చేేస్తారు

చిన్న పట్టణాల్లో ఉద్యోగాలిస్తాం-బీపీఓ కంపెనీలు

గుడ్లు ఫ్రిజ్​లో స్టోర్​ చేస్తే డేంజర్