రాజ్​భవన్‌‌పై దాడికి వెళ్లినట్లు ఉంది

రాజ్​భవన్‌‌పై దాడికి వెళ్లినట్లు ఉంది
  • కాంగ్రెస్ చలో రాజ్‌‌భవన్‌‌పై డీకే అరుణ ఫైర్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పిలుపునిచ్చిన చలో రాజ్‌‌భవన్‌‌ ముట్టడిని చూస్తుంటే.. ఆ పార్టీ నేతలు రాజ్‌‌ భవన్‌‌పై దాడికి వెళ్లినట్లు ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఈ దాడికి టీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇచ్చినట్లు స్పష్టమవుతుందని ఆరోపించారు. బీజేపీ నిరసనలకు పిలుపునిస్తే ఒక రోజు ముందే తమ పార్టీ నేతలను గృహ నిర్బంధం చేసే పోలీసులు.. కాంగ్రెస్ నేతలను రోడ్లపైకి ఎలా రానిచ్చారని గురువారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా కాంగ్రెస్, టీఆర్‌‌‌‌ఎస్‌‌లు ఒక్కటేనని మరోసారి రుజువైందన్నారు.