
సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (డీపీఐఎఫ్‌ఎఫ్)- 2024’ (Dadasaheb Phalke International film festival awards 2024) అట్టహాసంగా జరిగింది. ఈ అవార్డుల కార్యక్రమం మంగళవారం రాత్రి (ఫిబ్రవరి 21న) ముంబైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సినీ ప్రముఖులు సందడి చేశారు.
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కోసం యానిమల్ (Animal), జవాన్ (Jawan) సినిమాలు పోటీ పడ్డాయి. గతేడాది ఇండియాన్ బాక్సాఫీసు దగ్గర ఘన విజయం సొంతం చేసుకున్నజవాన్,యానిమల్ సినిమాలకు పలు విభాగాల్లో అవార్డు దక్కించుకున్నాయి. యానిమల్ మూవీ డైరెక్టర్ సందీప్ వంగా ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఉత్తమ నెగెటివ్ రోల్ బాబీ దేవోల్ యానిమల్ మూవీకి అవార్డు సొంతం చేసుకున్నారు. ఇక అట్లీ డైరెక్షన్లో తెరకెక్కిన జవాన్ సినిమాకు గాను షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడిగా, నయనతార ఉత్తమ నటిగా ఈ అవార్డు అందుకున్నారు.
2024 దాదా సాహెబ్ ఫాల్కే విజేతలు వీరే..
ఉత్తమ నటుడు: షారుఖ్ ఖాన్ (జవాన్)
ఉత్తమ నటి: నయనతార (జవాన్)
ఉత్తమ నటి (క్రిటిక్స్): రాణి ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ vs నార్వే)
ఉత్తమ దర్శకుడు: సందీప్ రెడ్డి వంగా (యానిమల్)
ఉత్తమ నటుడు (నెగెటివ్ రోల్)- బాబీ దేవోల్ (యానిమల్)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్)- విక్కీ కౌశల్ (సామ్ బహదూర్)
ఉత్తమ సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ (జవాన్)
ఉత్తమ నేపథ్య గాయకుడు – వరుణ్ జైన్
ఉత్తమ నేపథ్య గాయని – శిల్పా రావు
ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ - మౌషుమీ ఛటర్జీ
ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ - యేసుదాసు
టెలివిజన్ విభాగం
టెలివిజన్ సిరీస్ ఆఫ్‌ది ఇయర్ -(ఘమ్ హై కిసీకే ప్యార్ మేయిన్)
ఉత్తమ నటుడు - నీల్ భట్ (ఘమ్ హై కిసీకే ప్యార్ మేయిన్)
ఉత్తమ నటి - రూపాలీ గంగూలీ (అనుపమ)
వెబ్‌సిరీస్ విభాగం
ఉత్తమ వెబ్ సిరీస్ : ఫర్జీ
క్రిటిక్స్ ఉత్తమ నటి - కరిష్మా తన్నా (స్కూప్)
Get ready for a star-studded affair! Join us for the live broadcast of Dadasaheb Phalke International Film Festival Awards on Zee5 on 20th February, where cinematic excellence takes center stage.
— Dadasaheb Phalke International Film Festival (@Dpiff_official) February 16, 2024
Can’t catch it live? Stay tuned for the grand telecast on Zee TV, bringing you the… pic.twitter.com/kajrGxoc3e