
హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh) నటించిన సైంధవ్(Saindhav) మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజై ఆడియాన్స్ను ఆకట్టుకుంది. ఈ సినిమాలో వెంకటేష్ యాక్షన్, ఎమోషన్స్కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. కానీ, బాక్సాపీస్ వసూళ్ళలో మేకర్స్ అనుకున్నంత స్థాయిలో..సైంధవ్ రీచ్ అవ్వలేకపోయింది. భారీ అంచనాలతో వెంకటేష్ కెరీర్ మైల్ స్టోన్ 75వ మూవీగా థియేటర్లలో రిలీజైన సైంధవ్..మరో మూడు రోజుల్లో ఓటీటీలోకి రాబోతుంది.
లేటెస్ట్గా సైంధవ్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ను ప్రకటించారు మేకర్స్. ఈ మూవీ ఫిబ్రవరి 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం భాషల్లో సైంధవ్ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు అమెజాన్ ప్రైమ్ ఆఫీసియల్గా అనౌన్స్‌చేసింది. సైంధవ్ శాటిలైట్ హక్కులను ఈటీవీ దక్కించుకున్నట్లు సమాచారం.
సైంధవ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో రిలీజైంది. కాగా థియేటర్లలో విడుదలైన ఇరవై రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి వచ్చేస్తోండటం టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.
సైంధవ్ స్టోరీ:
సైంధవ్ సినిమాలో వెంకటేష్ రెండు విభిన్నమైన రోల్స్ ప్లే చేశాడు. సైకో అనే గ్యాంగ్‌స్టర్‌గా, ఓ చిన్నారికి తండ్రిగా (సైంధవ్) పాత్రలో డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో వెంకటేష్ నటించాడు. తన కూతురి ప్రాణాల కోసం కార్టెల్ అనే మాఫియా గ్యాంగ్‌తో సైకో ఎలాంటి పోరాటం సాగించాడు? కార్టెల్‌లోనే పనిచేసిన సైకో దాని నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? తన కూతురి ప్రాణాలను కాపాడుకోవడానికి పదిహేడు కోట్ల ఖరీదైన ఇంజెక్షన్‌ను సైకో ఎలా తెప్పించగలిగాడు అన్నదే ఈ మూవీ స్టోరీ.