
నా తోడల్లుడు చంద్రబాబు వింత జాతికి చెందిన వ్యక్తి అన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఉదయం ఒకమాట.. సాయంత్రం ఇంకోమాట మాట్లాడే స్వభావం చంద్రబాబుదన్నారు. ఊసరవెల్లి లాంటి స్వభావం ఉన్న వ్యక్తిత్వం తనది అని అన్నారు. పర్చూరు నియోజకవర్గం నుంచి తన కుమారుడు హితేష్ పోటీ చేస్తాడని తెలిపారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. రేపు తాడేపల్లిలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. రాజధాని నిర్మాణం పేరుతో నాలుగేళ్లుగా గ్రాఫిక్స్ చూపిస్తూ… చంద్రబాబు జనాలను పిచ్చోల్లను చేస్తున్నారన్నారు. ఇంటిలిజెన్స్ ఐజీ… ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు… పోలీసులను పార్టీ కార్యకర్తల్లా వాడుకుంటున్నారని విమర్శించారు.