- 4 నియోజకవర్గాల్లో డిజిటలైజేషన్‌పై ఎన్నికల అధికారి కర్ణన్ అసంతృప్తి
హైదరాబాద్ సిటీ, వెలుగు: చిలకలగూడ పరిధిలోని హమాల్‌బస్తీ పోలింగ్ స్టేషన్ ను జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ శుక్రవారం పరిశీలించారు. బూత్ లెవల్ ఆఫీసర్లు ప్రతిరోజూ 100 ఎన్యూమరేషన్ ఫారాలను తప్పనిసరిగా డిజిటలైజ్ చేయాలని, బూత్ లెవల్ సూపర్వైజర్లు 1,000 ఫారాలను తీసుకోవాలని ఆదేశించారు. ఓటరు లిస్ట్‌నుంచి చనిపోయిన వారి పేర్లను తొలగించేందుకు డెత్ సర్టిఫికెట్లను తీసుకోవాలన్నారు. అలాగే, ఈఆర్వోలతో సమీక్ష నిర్వహించారు.
సనత్‌నగర్, ముషీరాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో డిజిటైజేషన్ పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడంపై కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధిత ఈఆర్ వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు, పనితీరు మెరుగుపరచకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
