ఈవారం 4 ఐపీఓలు

ఈవారం 4 ఐపీఓలు

ముంబై: దలాల్​ స్ట్రీట్​ఈవారం ఐపీఓలతో సందడిగా ఉండబోతోంది.  ప్రొటీన్ ఈగవ్​​ టెక్నాలజీస్, ఏఎస్​కే ఆటోమోటివ్ అనే  రెండు మెయిన్‌‌‌‌‌‌‌‌ బోర్డ్ ఐపీఓలతోపాటు రెండు ఎస్​ఎంఈ ఇష్యూలు ఈ వారం ఇన్వెస్టర్ల ముంగిటికి వస్తున్నాయి. ఇదేవారం సెల్లో వరల్డ్,  మామా ఎర్త్‌‌‌‌‌‌‌‌ల లిస్టింగ్స్​ కూడా ఉన్నాయి.   టాటా టెక్నాలజీస్ ఐపీఓ ఈనెల మూడు లేదా నాలుగో వారంలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. బలమైన లిస్టింగ్ లాభాలు వస్తున్న కారణంగా 2024 వరకు మార్కెట్‌‌‌‌‌‌‌‌లో ఐపీఓల సందడి ఉండొచ్చని, ఈ నెలలోనే 14 ఐపీఓలు ఉన్నాయని పాంటోమత్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఎండీ మహావీర్ లునావత్ అన్నారు. ప్రొటీన్​ ఈవన్​, ఏఎస్​కే ఆటోమోటివ్ తమ పబ్లిక్ ఆఫర్‌‌‌‌‌‌‌‌ల ద్వారా సంచిత రూ. 1,324 కోట్లను సమీకరించాలని ప్లాన్ చేస్తున్నాయి.  

ప్రొటీన్ ఈగవ్ టెక్నాలజీస్

ప్రొటీన్ ఈగవ్ టెక్నాలజీస్  ఐపీఓ నవంబర్ 6న మొదలై,  నవంబర్ 8న ముగుస్తుంది. కంపెనీ ఒక్కో షేరుకు రూ.752–-792 ధరను నిర్ణయించింది. అప్పర్​ లిమిట్​లో  రూ.490 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. ఇష్యూ పూర్తిగా 61.9 లక్షల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్​).  360 వన్ స్పెషల్ ఆపర్చునిటీస్ ఫండ్, ఎన్​ఎస్​ఈ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్,  డాయిష్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లు తమ పాక్షిక వాటాలను అమ్ముతాయి.  ప్రొటీన్ ఈగవ్​ టెక్నాలజీస్ అనేది  జనాభా- స్థాయి గ్రీన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ టెక్నాలజీ సొల్యూషన్‌‌‌‌‌‌‌‌లను అభివృద్ధి చేసే ఐటీ సంస్థ. 

ఏఎస్​కే ఆటోమోటివ్

 ఏఎస్​కే ఆటోమోటివ్ తన ఐపీఓను నవంబర్ 7న ప్రారంభించనుంది. ఇది తొమ్మిదో తేదీన ముగుస్తుంది. ఈ ఆఫర్ పూర్తిగా 2.95 కోట్ల  ఓఎఫ్​ఎస్  ఇష్యూ.  ప్రైస్ బ్యాండ్ ఒక్కొక్కటి రూ.268–-282 మధ్య నిర్ణయించారు. ఓఎఫ్​ఎస్​ కింద, ప్రమోటర్లు కుల్దీప్ సింగ్ రాఠీ,  విజయ్ రాఠీ వరుసగా 2.06 కోట్ల షేర్లను,  88.7 లక్షల షేర్లను అమ్ముతారు.  ఏఎస్​కే ఆటోమోటివ్ సేఫ్టీ సిస్టమ్స్​ను, క్రిటికల్​ ఇంజనీరింగ్​ సొల్యూషన్లను అందిస్తుంది.  

ఎస్​ఎంఈ ఐపీఓలు

ఎస్​ఎంఈ విభాగంలోని రెండు ఐపీఓలు -రాక్స్​హైటెక్,​సన్​రెస్ట్​ లైఫ్​ సైన్సెస్​ ఈవారమే సబ్‌‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటాయి. రెండు ఇష్యూలు నవంబర్ 7న ప్రారంభమవుతాయి. నవంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సన్‌‌‌‌‌‌‌‌రెస్ట్  లైఫ్‌‌‌‌‌‌‌‌ సైన్సెస్‌‌ ఐపీఓ ఆఫర్ సైజు సుమారు రూ. 10.85 కోట్లు.  ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ. 84గా నిర్ణయించారు.  రాక్స్​హైటెక్​ ఇష్యూ సైజు రూ.54-కోట్లు కాగా, ప్రైస్​బ్యాండ్  రూ.80–83 మధ్య ఉంటుంది.